ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో వింత ఘటన చోటు చేసుకుంది. వినాయక స్వామి ముల్లంగిలో కనిపించారు. ముల్లంగి గణపతి ఆకారంలో దర్శనమివ్వగా స్థానికంగా ఈ ఘటన వైరల్ అవుతోంది. ముల్లంగి వినాయకుని ఆకారంతో పాటు తొండంతో ఉండటం గమనార్హం. ఈ విషయం తెలిసిన స్థానికులు ముల్లంగి రూపంలో ఉన్న వినాయకునికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వింత గతంలో ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతుండటం గమనార్హం.
Also Read: శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకునే వారికి షాక్
పూర్తి వివరాల్లోకి వెళితే నందిగామలోని పబ్బతి రామచంద్ర రావు అనే వ్యక్తి ఇంట్లో కూరగాయలు అవసరమై స్థానికంగా ఉండే రైతు బజార్ కు వెళ్లి కూరగాయలను కొనుగోలు చేశాడు. రామచంద్ర రావు కొనుగోలు చేసిన కూరగాయల్లో ముల్లంగి కూడా ఉండగా ఒక ముల్లంగి గణపతి ఆకారంలో కనిపించడంతో రామచంద్ర రావు, అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ముల్లంగిని పరిశీలించగా ముల్లంగి పై నుంచి కింది వరకు వినాయకుడిని పోలి ఉంది.
Also Read: నష్ట పోయిన ధనం తిరిగి రావాలంటే శివుడికి ఈ నీటితో అభిషేకం చేయాల్సిందే..!
ముల్లంగి వినాయకునిని పోలి ఉండటంతో రామచంద్ర రావు కుటుంబ సభ్యులు ముల్లంగిని శుభ్రం చేయడంతో పాటు ఇంట్లోని పూజా మందిరంలో ఉంచారు. ఆ తరువాత సాధారణంగా దేవునికి ఏ విధంగా పూజలు చేస్తారో వినాయకుడికి కూడా అదే విధంగా పూజలు నిర్వహించారు. ఆ తరువాత విషయం ఇరుగుపొరుగు వాళ్లకు తెలియడంతో ముల్లంగిలో దర్శనమిచ్చిన వినాయకుడిని చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలు రామచంద్ర రావు ఇంటికి చేరుకుంటున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా రామచంద్ర రావు ఇంటికి ప్రజలు చేరుకుంటున్నారు. ముల్లంగి ఆకారంలో వినాయకునికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.