మన దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ చికెన్ విక్రయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు పట్టణాల్లో చికెన్ ధరలు తగ్గగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సైతం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. నిన్నటివరకు నగరంలో కిలో చికెన్ ధర 250 రూపాయలకు అటూఇటుగా ఉండగా నేడు చికెన్ ధర 150 రూపాయలకు పడిపోయింది. మరోవైపు ఫౌల్ట్రీ వ్యాపారులు బర్డ్ ఫ్లూ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
Also Read: నిద్రలేమికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే…?
చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా తగ్గుతుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరగగా హైదరాబాద్ లోనే లక్ష కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. అయితే గత కొన్ని రోజులుగా ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం ఏర్పడటంతో సగానికి పైగా చికెన్ ధరలు తగ్గాయని భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు.
Also Read: పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
దేశంలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు కోళ్ల దిగుమతులపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వెలుగులోకి రాకపోయినా ప్రజలు చికెన్ తినడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
సాధారణంగా ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో చికెన్ విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ బర్డ్ ఫ్లూ విజృంభణ వల్ల ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు నెలకొనడం గమనార్హం. బర్డ్ ఫ్లూ వ్యాప్తి తగ్గితే మాత్రమే మళ్లీ చికెన్, గుడ్ల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.