https://oktelugu.com/

ఫీ‘జులుం’పై సర్కార్ సీరియస్

కరోనా కల్లోలంతో అందరి ఆదాయాలు పడిపోయాయి. ఉద్యోగ ఉపాధి కోల్పోయారు. ఈ టైంలోనూ కొందరు రాబంధుల్లా ప్రజలమీద పడిపీక్కుతింటున్నారు. వారిలో ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ విద్య అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల ఫీజులు వసూలు చేస్తున్నాయి. Also Read: చంద్రబాబు.. మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం? ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు తాజాగా జగన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర నియంత్రణ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2021 / 08:54 AM IST
    Follow us on

    కరోనా కల్లోలంతో అందరి ఆదాయాలు పడిపోయాయి. ఉద్యోగ ఉపాధి కోల్పోయారు. ఈ టైంలోనూ కొందరు రాబంధుల్లా ప్రజలమీద పడిపీక్కుతింటున్నారు. వారిలో ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ విద్య అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల ఫీజులు వసూలు చేస్తున్నాయి.

    Also Read: చంద్రబాబు.. మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం?

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు తాజాగా జగన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర నియంత్రణ సంస్థ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) గురువారం కాలేజీ మేనేజ్‌మెంట్లను ఆదేశించి ఫీజులను 30 శాతం తగ్గించాలని హెచ్చరించింది.

    “అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు అక్టోబర్ 10 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని ఆదేశించబడ్డాయి, ఇందులో ప్రభుత్వం ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించింది” అని బిఐఇ కార్యదర్శి వి.రామ కృష్ణ అన్నారు. ఈ ఫీజు మినహాయింపు ఉత్తర్వు 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపారు.

    Also Read: ఎడతెగని ‘పంచాయితీ’.. నిమ్మగడ్డకు షాక్.. సుప్రీంకు జగన్

    అదేవిధంగా, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ ట్యూషన్ ఫీజుల వివరాలను కేటగిరీల వారీగా బులెటిన్ బోర్డులో ప్రదర్శించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశించారు. “తరువాత గమనించి ఏదైనా తేడా ఉంటే తీవ్రంగా పరిగణిస్తుంది. కఠినమైన చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.

    కీలకమైన రెండేళ్ల కోర్సు కోసం సంవత్సరానికి రూ .1.5 లక్షలు వసూలు చేస్తున్న విజయవాడలోని కొన్ని ప్రైవేట్ కళాశాలలపై అధికారులు బుధవారం దాడి చేశారు. వారు ఈ కళాశాలల్లోని పరిస్థితులు.. సేవలను పరిశీలించారు. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సంస్థలపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సర్కార్ నడుం బిగిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్