Homeఎంటర్టైన్మెంట్ట్రైలర్ టాక్ : '౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా' !

ట్రైలర్ టాక్ : ‘౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా’ !

30 Rojullo Preminchadam Ela
యాంకర్ ప్రదీప్ హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా రానున్న సినిమా ‘౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ రిలీజ్‌ చేశాడు. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాలో మ్యాటర్ ఉండేలా కనిపిస్తుంది. ‘నువ్వు వదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే అన్న హీరో డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ను చూస్తుంటే.. సినిమాలో ఎమోషన్ తో పాటు మంచి కామెడీ కూడా ఉండేలా ఉంది. ఇక ప్రదీప్‌ ఓవైపు గ్రామీణ యువకుడిగా కనిపిస్తూనే మరోవైపు కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు.

Also Read: భార్య పుట్టినరోజు జరిపేందుకు మహేష్ బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే?

కాగా రెండు రకాల పాత్రల్లో ప్రదీప్ లుక్స్ పరంగా కూడా వేరియేషన్స్ ను బాగా చూపించాడు. అయితే యూత్ ను ఆకట్టుకోవడానికి ప్రదీప్‌ మీద లిప్‌ లాక్‌ సీన్‌ కూడా పెట్టారు. కిస్ సీన్ లో కూడా హీరో హీరోయిన్లు ఇద్దరూ పోటీ పడి మరీ నటించారు. నటన పరంగా కూడా ఇద్దరూ చాలా బాగా నటించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హైపర్‌ ఆది, వైవా హర్ష, పోసాని కృష్ణ మురళీ వంటి కమెడియన్లు కూడా ఉండటంతో.. సినిమాలో కామెడీకి ఎలాంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ పంచ్‌లు వేసి అలరించే ప్రదీప్‌ ఈ సినిమాలో కూడా వాటిని సమయానుసారం వాడాడట.

Also Read: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా..?

కాగా హీరో హీరోయిన్లు ఇద్దరూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కయ్యానికి కాలు దువ్వుకునే క్రమంలో ఎలా ప్రేమలో పడ్డారు..? అసలు ఈ 30 రోజుల్లో ప్రేమించుకోవాలనే ఆలోచన ఏమిటి ? అనేదే సినిమాలో మెయిన్ కంటెంట్ అట. మరి వారు అంత తక్కువ టైములో ప్రేమలో పడతారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నీలి నీలి ఆకాశం పాట అంత బాగుంది ట్రైలర్‌ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రొడ్యూసర్‌ ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.​​ పాటలతో సంచనాలు సృష్టిస్తోన్న ఈ సినిమా జనవరి 29న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

30 Rojullo Preminchadam Ela Trailer | Pradeep Machiraju,Amritha Aiyer | Munna | Anup Rubens |SV Babu

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version