Youth : యువత ట్రెండ్ ఫాలో అవ్వరు.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ఉంటారు. అందువల్లే కదా వారి ఇష్టాలను అనుసరించే ప్రపంచం అడుగులు వేస్తూ ఉంటుంది. కాస్మెటిక్స్ నుంచి మొదలుపెడితే చెప్పుల వరకు యువత ఏది అనుసరిస్తే దానినే ఆయా కంపెనీలు అనుసరిస్తుంటాయి. ఆ దిశగానే తమ ఉత్పత్తులను తయారుచేస్తూ ఉంటాయి. వేలకోట్ల వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటాయి. ప్రపంచంలో పేరు పొందిన సంస్థలు మొత్తం యువత ఇష్టాలకు అనుగుణంగానే తమ ఉత్పత్తులను తయారు చేస్తుంటాయి. యువత కోరుకున్న విధంగానే అమ్ముతుంటాయి. అందుకే యువత తీరుకు తగ్గట్టుగా అప్డేట్ అయిన కంపెనీలు విపరీతమైన వృద్ధిని సాధించాయి. భారీగానే వెనకేసుకుంటున్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్ స్పీచ్ ని రీమేక్ చేసిన విజయ్..వైరల్ అవుతున్న వీడియో!
ఇప్పుడు రూట్ మార్చారు
కోపాన్ని.. నిరసనను వ్యక్తం చేయడంలో యువత స్టైలే వేరు. నేరుగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా.. ఏదో ఒక రూపంలో ప్రదర్శించడం యువతకు అలవాటు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండడంతో యువత ఏదో ఒక రూపంలో తమ నిరసనను.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొటేషన్లను రూపొందిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్, ఇన్ స్టా బయో ల కాలం నడుస్తున్న ఈ రోజుల్లో.. యువత తాము ధరిస్తున్న టీ షర్ట్ లలో రకరకాల కొటేషన్లు రాసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఇటీవల కాలంలో టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్(Yazuvendra Chahal) నా భార్య ధనశ్రీ (Dhanashree)తో విడాకులు తీసుకునేందుకు ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చాడు. ఈ క్రమంలో తను వేసుకున్న టీ షర్ట్ పై బీ యువర్ షుగర్ డాడీ (Be your sugar Daddy) అనే కొటేషన్ ను రూపొందించుకున్నాడు. “వయసు ఎక్కువైనవారు తోడు కోసం అమ్మాయి లేదా అబ్బాయిని ఎంచుకోవడమే” Be your sugar Daddy అనే కొటేషన్ కు అర్థం. చాహల్ మాదిరిగానే యువత తమ భావోద్వేగాలను.. భావాలను.. మనస్తత్వాలను టీ షర్టులపై రూపొందించిన కొటేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ” యువత తమ భావాలను వ్యక్తం చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. పైగా ప్రతి అంశంలో వారిదైన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందువల్లే యువత చుట్టూ ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు కూడా యువత ఆధారంగానే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం కొటేషన్ ఆధారంగా రూపొందిస్తున్న టీ షర్టుల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇందులో నాణ్యమైన టీషర్టులకే యువత ప్రాధాన్యం ఇస్తోంది. తమకు నచ్చిన కొటేషన్లు రూపొందించాలని కంపెనీలకు ఆర్డర్లు ఇస్తోంది. అందువల్లే నేటి తరం ఏ విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. ఏ విషయంలోనూ రాజీ పడేందుకు ప్రయత్నించడం లేదు. మొత్తంగా ప్రపంచం మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్నదని” మానసిక నిపుణులు చెబుతున్నారు.
View this post on Instagram