Thalapathy Vijay : తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) గురించి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే ఆయన పెద్ద సూపర్ స్టార్ కానీ, ఒకప్పుడు మాత్రం ఆయన్ని రీమేక్ స్టార్ అని పిలిచేవారు. మహేష్ బాబు(Superstar Mahesh Babu) కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిల్చిన ‘ఒక్కడు’, ‘పోకిరి’ వంటి చిత్రాలను తమిళం లో రీమేక్ చేసింది ఈయనే. ముఖ్యంగా ఒక్కడు చిత్రాన్ని తమిళం లో ‘గిల్లీ’ పేరుతో రీమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రానికి ముందు విజయ్ కేవలం ఒక మామూలు హీరో మాత్రమే, లవ్ స్టోరీస్ తీసుకుంటూ ఉండేవాడు. ఈ చిత్రం తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ‘తమ్ముడు’ చిత్రాన్ని తమిళం లో ‘బద్రి’ పేరుతో రీమేక్ చేశాడు.
Also Read : హీరోయిన్ సమంత కి గుడి కట్టిన వీరాభిమాని..వైరల్ అవుతున్న వీడియో!
అంతే కాదు పవన్ కళ్యాణ్ సినిమాల్లోని సూపర్ హిట్ పాటలను కూడా అప్పట్లో చాలానే రీమేక్ చేశాడు. పాటలతో ఆగిపోలేదు ఎన్టీఆర్(Junior NTR), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) డ్యాన్స్ స్టెప్పులను కూడా కాపీ కొట్టేవాడు ఆరోజుల్లో. ఈ రేంజ్ లో రీమేక్స్ చేసిన హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి లేదేమో. తుపాకీ చిత్రం నుండి విజయ్ లో మార్పు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రీమేక్ సినిమాల జోలికి పోకుండా, అద్భుతమైన క్వాలిటీ సినిమాలు చేస్తూ తమిళనాడు లో నెంబర్ 1 హీరో గా మారిపోయాడు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని తమిళం లో ‘జన నాయగన్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే విజయ్ ఇటీవలే TVK అనే పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు ప్రసంగాలు చేశాడు. నిన్న సర్వ సభ్య సభలో ఆయన ఇచ్చిన ప్రసంగం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి రీమేక్ అంటూ ట్విట్టర్ లో అజిత్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
నిన్న ఆయన ప్రసంగం ముగింపు వ్యాఖ్యలుగా ‘మెన్ మే కం..మెన్ మే గో..బట్ ఐ గో ఆన్ ఫరెవర్’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ‘వచ్చే వాళ్ళు వస్తుంటారు..పోయేవాళ్లు పోతుంటారు..కానీ నేను మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటాను’ అని అంటాడు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే స్లోగన్ ని అందిస్తాడు. అలా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను, రీసెంట్ గా విజయ్ చేసిన వ్యాఖ్యలను క్లబ్ చేస్తూ ఒక వీడియో చేసారు. దానిని మీరు క్రింద చూడవచ్చు. సినిమాలను మాత్రమే కాదు, ప్రసంగాలను కూడా రీమేక్ చేస్తావా అంటూ అజిత్ ఫ్యాన్స్ విజయ్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
Also Read : 48 గంటల్లో 120 కోట్లు..చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’
TAMIL AND TELUGU MOVIES MAY COME AND GO…BUT VIJAY REMAKING IT ALWAYS REMAINS..! #tvkvijay #Vijay #pawankalyan #TVK #TVKVijay #TamilJanam #JanasenaParty #tvkvijayspeech #tamiljanam pic.twitter.com/V2sDdfGqHk
— Tamil Janam (@TamilJanamNews) March 29, 2025