Astrology: శని దేవుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి శని పీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు కొనసాగుతుంది. అందువల్ల కొందరు జీవితంలో కష్టాలు, నష్టాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న వారు తమకు శని పట్టిందని భావిస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ఒక రాశిలో ప్రయాణం చేస్తున్న సమయంలో మిగతా రాశులపై కూడా ప్రభావం పడుతుంది. మార్చి 29 నుంచి శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. ఈ సందర్భంగా మూడు రాశులపై ప్రభావం పడింది. ఈ రాశుల వారు కొన్నాళ్లపాటు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోక తప్పదు అని జాతక చక్రం తెలుపుతోంది. అయితే ఆ రాశులు ఏవో తెలుసుకుందాం..
శనీశ్వరుడు ఒక రాశిలో ప్రవేశించిన తర్వాత రెండున్నర ఏళ్ల పాటు కొనసాగుతాడు. మార్చి 29న శనీశ్వరుడు మీన రాశిలోకి ప్రవేశం చేశారు. అయితే శనీశ్వరుడు 12వ స్థానంలో ప్రవేశిస్తే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీంతో ప్రభావం పడే రాష్ట్రంలో 12వ ఇంట, ఒకటవ ఇంట, రెండవ ఇంట శని ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 29 నుంచి మకరం, కుంభం, మీనా రాశుల వారిపై ఏలినాటి శని కొనసాగనుంది. ఈ రాశుల తర్వాత మేష రాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది.
ఏలినాటి శని ప్రారంభం అంటే ఒక రాశిలో శనీశ్వరుడు ఆర్థిక సమస్యలను సృష్టిస్తారు. ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఏ పని మొదలుపెట్టిన అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. రెండవ దశ లో కుటుంబం అల్లకలోలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పై మూడు రాశుల వారు కుటుంబాలకు దూరంగా ఉండటమే మంచిది. అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. ఈ మూడు రాశుల వారు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే వీరు సొంత వాహనాలపై ప్రయాణాలు చేయాల్సి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు సొంత వాహనాలపై ప్రయాణాలు చేయకుండా ఉండాలి.
మరికొన్ని రోజుల తర్వాత శని మూడవ దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో భౌతికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల దూరమవుతారు. కొందరితో విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఈ బాధల నుంచి తట్టుకోవడానికి శనీశ్వరుడిని ప్రసాదం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా హనుమంతుడిని పూజించడం వల్ల శని ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామిని పూజిస్తూ హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ దండకం చదువుతూ ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామం చదువుతూ ఉండాలి. ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. శని స్తోత్రం, శని చాలీసా చదువుతూ ఉండాలి. దీంతో కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.