Ration Cards: ప్రజలకు అవసరమైన ఎన్నో ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలని భావించే వాళ్లకు ఎంతో అవసరమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డును పోగొట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సులభంగానే రేషన్ కార్డును తిరిగి పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
రేషన్ కార్డును పోగొట్టుకున్న వాళ్లు కొత్త రేషన్ కార్డును పొందాలంటే మొదట ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. ఒక్కో రాష్ట్రానికి ఈ వెబ్ సైట్ వేరుగా ఉంటుందనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సంబంధిత వెబ్ సైట్ లో డూప్లికేట్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా సులభంగా డూప్లికేట్ రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: చైతూ-ధనుష్ విడాకులు..దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన తప్పేంటి?
డూప్లికేట్ రేషన్ కార్డును పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా సులభంగా రేషన్ కార్డును పొందవచ్చు. ఆఫ్ లైన్ లో కూడా రేషన్ కార్డును సులభంగా పొందే అవకాశం ఉంటుంది. జిల్లా ఫుడ్ సప్లయిస్ కంట్రోలర్ ఆఫీస్ కు వెళ్లడం ద్వారా రేషన్ కార్డును పొందే అవకాశం పొందవచ్చు. జిల్లా ఫుడ్ సప్లయిస్ కంట్రోలర్ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకెళ్లాలి.
డిపో హోల్డర్ రిపోర్ట్, పెనాల్టీ ఫీజుల రశీదులతో పాటు కుటుంబ సభ్యుల ఫోటోగ్రాఫ్ లను సబ్మిట్ చేయడం ద్వారా సులభంగా కొత్త రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసి సులభంగా డూప్లికేట్ రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?