https://oktelugu.com/

Karthika Deepam: రుద్రాణికి షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ బాబు.. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. దీప ప్రకృతి వైద్యశాలకు వెళ్లి రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అని ఆమెని చూసి నమస్కరించుకోవాలి అని లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ సౌందర్య, ఆనందరావు ఉండేసరికి వారిని చూసి అలాగే షాక్ అవుతూ ఏడుస్తుంది. ఇక్కడికి వచ్చారు ఏంటి అని ఆలోచనలో పడుతుంది. అంటే రుద్రాణిని కొట్టింది అత్తయ్య గారే నేమో అని వారి మధ్య ఏమి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2022 / 09:24 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. దీప ప్రకృతి వైద్యశాలకు వెళ్లి రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అని ఆమెని చూసి నమస్కరించుకోవాలి అని లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ సౌందర్య, ఆనందరావు ఉండేసరికి వారిని చూసి అలాగే షాక్ అవుతూ ఏడుస్తుంది. ఇక్కడికి వచ్చారు ఏంటి అని ఆలోచనలో పడుతుంది.

    Karthika Deepam:

    అంటే రుద్రాణిని కొట్టింది అత్తయ్య గారే నేమో అని వారి మధ్య ఏమి గొడవలు జరిగాయో అని బాగా ఆలోచిస్తూ.. ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక కార్తీక్ కోపంతో రుద్రాణి దగ్గరికి వెళ్లి నా పిల్లల దగ్గరికి వస్తే అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా రుద్రాణి భయపడదు.ఇక దీప రోడ్డుపై నడుచుకుంటూ సౌందర్య వాళ్లను చూసిన సీన్ గుర్తుకు చేసుకుంటుంది.

    Also Read:  భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?

    ఇక్కడికి ఎందుకు వచ్చారో అని.. ఎప్పుడు వచ్చారో అని బాధపడుతుంది. ఒకే ఊర్లో ఉన్న కూడా చూసుకోలేని పరిస్థితి అంటూ ఏడుస్తుంది. ఈ విషయం డాక్టర్ బాబు కి చెప్పాలా వద్దా అని అనుకుంటుంది. కార్తీక్ కూడా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ మమ్మీ డాడీ ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తాడు. రుద్రాణి మాటలు తలుచుకొని కుమిలిపోతాడు. అలా రోడ్డుపై వస్తున్న కార్తీక్ ఎక్కడో ఆలోచించుకుంటూ బండి కి ఎదురుగా వెళ్తాడు.

    ప్రమాదం నుంచి బయట పడతాడు. ఇక మమ్మీ డాడీ లను చూసిన విషయాన్ని దీపకు చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడతాడు. చెప్పకపోవడమే మంచిదని అనుకుంటాడు. మరోవైపు మోనిత బొమ్మని చూసి తన బాబు అనుకోని ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి విన్నీ కి ఎటు అర్థం కాకుండా ఉంటుంది. కార్తీక్ ఇంట్లోకి సిలిండర్ తీసుకుని వస్తాడు. ఇక పిల్లలు సరదాగా బయటికి వెళ్దామా అనేసరికి కార్తీక్ ఎప్పుడైనా వెళ్దాం అని నచ్చ చెప్తాడు.

    Also Read:  పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?