Char Dham Yatra : ఆరు నెలల తరువాత కేదార్ నాథ్ బద్రినాథ్ ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా కేదాన్ నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి, రుద్ర ప్రయాగ వంటి క్షేత్రాలను దర్శించవచ్చు. కానీ ఇదే సమయంలో మరికొన్ని ప్రదేశాలకు కూడా వెళ్లొచ్చు. చార్ ధామ్ యాత్ర బడ్జెట్ లోనే మరికొన్ని ప్రదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏవంటే?
చార్ ధామ్ యాత్రలో భాగంగా హిమాలయాల పర్వతాల్లో కొలువైన పై క్షేత్రాలను దర్శించాలని చాలా మంది అనుకుంటారు. ఈ ఏడాది మే 10న కేదార్ నాథ్ ఆలయ దర్శనం ప్రారంభం కావడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే చార్ ధామ్ యాత్రంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రినాథ్ ఆలయాలతో పాటు మరికొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్లొచ్చు. వీటలో ప్రధానమైనది చంద్రశి.
ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ జిల్లాలో చంద్రశిల ఉంటుంది. ఇది 3679 మీటర్ల ఎత్తులో ఉంంది. ట్రెక్కింగ్ చేసేవాళ్లకు చంద్రశిల అనువైన ప్రదేశం. అలాగే మరో చూడదగ్గ ప్రదేశం చోప్తా. ఇది 2900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధ తుంగనాథ్ దేవాలయం కూడా ఉంది. ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే ట్రెక్కింగ్ చేయాలనుకున్నా.. కాస్త ఎనర్జీ కావాల్సి ఉంటుంది.
వీటితో పాటు సోన్ ప్రయాగ్ కూడా ప్రముఖమైనది. ఇది 1829 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సోన్ ప్రయాగలో అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. చూట్టూ అద్భుతమైన వాతావరణం ఉంటుంది. వాసుకితాల్ పవిత్ర స్థలానికి ఈ ట్రిప్పులోనే వెళ్లొచ్చు. ఇది 4135 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వాసుకితాల్ వెళ్తే కొత్త అనుభూతి కలుగుతుంది. అలాగే ఆస్త్యముని దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పవిత్ర ఆలయానికి జైశాభి పండుగ సందర్భంగా చాలా మంది భక్తులు తరలివస్తారు.