Health Tips: కాఫీకి ప్రత్యామ్నాయంగా ఇవి తీసుకోండి..? ప్రయోజనాలు తెలిస్తే షాక్

నిమ్మకాయ నీరు.. నిమ్మకాయ నీటిని ప్రతి రోజు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గించడంతో పాటు బరువును నియంత్రించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ నిమ్మరసంలో అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Written By: Swathi, Updated On : May 13, 2024 2:30 pm

Health Tips

Follow us on

Health Tips: సాధారణంగా మనలో చాలా మంది టీ, కాఫీలను తాగుతుంటారు. రోజు మొదలు కావాలన్నా కప్పు కాఫీ ఉండాల్సిందే. మనం ఎంతో ఇష్టపడే కాఫీ ఉత్తేజంగా ఉంచినప్పటికీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కాఫీకి బదులుగా కొన్ని పానీయాలను సేవించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంతకీ అవి ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా గ్రీన్ టీ.. నార్మల్ గా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకేనండి..దీన్ని యావత్ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పానీయమని పిలుస్తుంటారట. మన రెగ్యులర్ డైట్ లో గ్రీన్ టీని చేర్చడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

నిమ్మకాయ నీరు.. నిమ్మకాయ నీటిని ప్రతి రోజు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గించడంతో పాటు బరువును నియంత్రించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ నిమ్మరసంలో అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.

తరువాత కొబ్బరి నీరు.. సాధారణంగా కొబ్బరిలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరం కోల్పోయిన పోషకాలను భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీళ్లు హైడ్రేట్ గా ఉంచుతుంది. అదేవిధంగా బీట్ రూట్ జ్యూస్.. ఇది కణాలను అభివృద్ధి చేయడంతో పాటు పని తీరును ప్రోత్సహిస్తుంది. ఫోలేట్ రక్తనాళాల క్షీణతను నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాదు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చివరిగా తేనె, దాల్చిన చెక్క నీరు.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఈ క్రమంలోనే మీకు కూడా కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు కనుక ఉన్నట్లయితే.. దానికి బదులుగా ఈ డ్రింక్స్ ను తాగే ప్రయత్నం చేయండి. దీని వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.