https://oktelugu.com/

Worms in rice : బియ్యంలో పురుగులు పట్టాయా? జస్ట్ సింపుల్ ఇలా చేయండి పురుగులు మొత్తం పరార్ అవుతాయి..

చాలా మంది బియ్యాన్ని నిల్వ ఉంచుకుంటారు. ఆరు నెలలు, సంవత్సరం కూడా కొంతమంది ఇంట్లో బియ్యం నిల్వ ఉంటాయి. నాణ్యమైన బియ్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ, కొన్ని రోజులకు ఈ బియ్యంలో లక్క పురుగు, నల్లటి పురుగులు వస్తుంటాయి

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 23, 2024 9:06 am
    Worms in rice? Just do this simple and all the worms will disappear..

    Worms in rice? Just do this simple and all the worms will disappear..

    Follow us on

    చాలా మంది బియ్యాన్ని నిల్వ ఉంచుకుంటారు. ఆరు నెలలు, సంవత్సరం కూడా కొంతమంది ఇంట్లో బియ్యం నిల్వ ఉంటాయి. నాణ్యమైన బియ్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ, కొన్ని రోజులకు ఈ బియ్యంలో లక్క పురుగు, నల్లటి పురుగులు వస్తుంటాయి. అయితే వీటిని తొలగించడం అంత సులభం కాదు. గ్రామాల్లో ఉన్నవారు చాటలతో చెరిగి బియ్యానికి పట్టిన పురుగును తీసేస్తారు. కానీ పట్నం వారికి అంత సమయం ఉండదు కదా. ప్రస్తుతం పల్లె వారు అయినా పట్నం వారు అయినా ఫుల్ బిజీ అయ్యారు. చెరగడం ఎవరికి సాధ్యం కావడం లేదు. అందుకే ముందు బియ్యానికి పురుగు పట్టకుండా చూస్తే ఈ సమస్య ఉండదు. వండే ముందు టెన్షన్ ఉండదు కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూసేద్దాం.

    ఇంగువ : వంటల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ తో బియ్యంలోని పురుగుకు పులిస్టాప్ పెట్టవచ్చు. ఇంగువ నుంచి వచ్చే ఘాటైన వాసన వల్ల బియ్యానికి పురుగులు పట్టవు అంటున్నారు నిపుణులు. బియ్యం కొన్న తర్వాత రైస్ బ్యాగ్ ను ఓపెన్ చేయగానే అందులో కాస్త ఇంగువ కలిపితే సరిపోతుంది. ఈ ఇంగువ బియ్యంలోని పురుగులను మాత్రమే కాదు తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను కూడా నశింపచేస్తుంది.

    వేపాకులు : బియ్యం నిల్వ చేయడానికి వేపాకులు మంచి రెమెడీ. ఇందులోని క్రిమిసంహారక గుణాలు బియ్యంలో పురుగులు రాకుండా చేస్తాయి. అందుకే ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేయాలి. దీన్ని ఓ క్లాత్లో చిన్న చిన్న మాటలుగా కట్టాలి. ఆ మూటలను బియ్యం మధ్యలో వేయాలి. ఈ రెమెడీలు పాటిస్తే బియ్యంలో తెల్లపురుగులతో పాటు పెంకు పురుగులు కూడా పరార్ అవుతాయి.

    కర్పూరం : కర్పూరం నుంచి వచ్చే ఘాటైన సువాసన వల్ల కూడా బియ్యంలో పురుగులు, బ్యాక్టీరియా రాకుండా ఉంటాయి. పది కర్పూరం బిళ్లలను తీసుకోవాలి. వాటిని మెత్తని పొడిగా చేసుకోండి. దీన్ని కూడా ఓ వస్త్రంలో కట్టి బియ్యం డబ్బాలో వేయాలి. దీని వల్ల పురుగులు పట్టకుండా బియ్యం ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

    బోరిక్‌ పౌడర్ : బియ్యంలో పురుగులు పెరగడానికి తేమ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. కొన్ని కారణాల వల్ల బియ్యంలో తేమ చేరుతుంది. అందుకే బియ్యంలో పురుగులు పడతాయి. సో బియ్యంలో తడి చేరకుండా చూసుకోవాలి. బియ్యంలో కొద్దిగా బోరిక్‌ పౌడర్‌ని కలపితే అందులో చేరిన తేమను పీల్చేసుకుంటుంది ఈ పౌడర్. దీంతో బియ్యంలో పురుగులు కూడా చేరవు.

    లవంగాలు, మిరియాలు : బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికి లవంగాలు, మిరియాలు మంచి రెమెడీ. ఓ వస్త్రంలో లవంగాలు లేదా మిరియాలు మూటలుగా కట్టి బియ్యంలో వేయండి.

    ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు : బియ్యంలో ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు వేసినా సరే బియ్యంలో పురుగులు పట్టవు.