Eating too fast : అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ అన్నాన్ని ఎంతో శ్రద్ధగా, ఇష్టంగా తినాలి. చాలా జాగ్రత్తగా తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆహారంలో ముఖ్యమైన కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల మీ భోజనం మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇక ఈ ఆహారాల విషయంలో ఎంత శ్రద్ధ వహించాలో.. తినే విధానం విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి అంటున్నారు నిపుణులు. కొందరు స్పీడ్ గా తింటారు. కొందరు స్లోగా తింటారు. ఈ వేగంగా ఆహారం తినడం చాలా మందిలో కామన్ గా కనిపిస్తుంటుంది. కానీ ఈ అలవాటు వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయట. వేగంగా తినడం వల్ల కలిగే కొన్ని ప్రధాన సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. మరి వేగంగా ఆహారం తినడం వల్ల ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.
వేగంగా తినేటప్పుడు ఎక్కువగా గాలిని మింగుతుంటారు. ఇది అజీర్తి, గ్యాస్, అధిక ఆమ్లత్వం వంటి సమస్యలను కలిగిస్తుందట. వేగంగా తినడం వల్ల ఎప్పుడు పూర్తిగా తిన్నామో అర్థం కాదు. గ్రహించడం కష్టమే. దీని వల్ల అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారు. అంటే బరువు పెరుగుతారు అన్నమాట. వేగంగా తినడం వల్ల గుండె రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
వేగంగా తినే అలవాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతుంటాయి. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, అధిక బరువు, మెటబాలిజం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం గొంతులో ఇరుక్కోపోయే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.వేగంగా తిన్నప్పుడు ఆహారం సరిగ్గా నమలకపోవచ్చు. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
మానసిక ఒత్తిడి, నిద్రలేమి చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటి చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఈ అలవాటును మానుకోవడం చాలా మంచిది. తినేటప్పుడు ఒక ముద్ద పెట్టుకొని ప్రశాంతంగా నమిలిన తర్వాత తినండి. ఆహారాన్ని బాగా నమలడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. ఆహారం తింటున్నప్పుడు చుట్టూ ఉన్న వారితో మాట్లాడవద్దు.ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. తినే ముందు తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగకుండా కాస్త నీరు మాత్రమే తాగాలి. ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని మీ భోజనం ముగించండి. నిదానంగా భోజనం చేస్తే డయాబెటిస్, పీసీఓడీ, హై బీపీ వంటి సమస్యలు తక్కువ వస్తాయి.