Red Fort : భారతదేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎన్నో కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల గురించి మాట్లాడితే మాత్రం కచ్చితంగా ఎర్రకోట గుర్తుకు వస్తుంది. దానిలోని రహస్యాలు, కథల గురించి నేటికీ ప్రజలు మాట్లాడుకుంటారు. ఎర్రకోటకు ఢిల్లీ గేట్, లహౌరీ గేట్ అనే రెండు ద్వారాలు ఉన్నాయి. ఎర్రకోట లాహోరీ గేట్‌ను ప్రధాన ద్వారం గా పిలుస్తారు.. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో నిర్మించిన ఒక కట్టడం. ఈ ద్వారం ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉంటుంది. ఇది ప్రసిద్ధ మార్కెట్ చాందినీ చౌక్ వైపు ఓపెన్ ఉంటుంది. ఆ సమయంలో చాందినీ చౌక్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. అంతేకాదు ఈ లాహోరీ గేట్ దాని ప్రధాన ద్వారం. ఇక ఈ లాహోరీ గేట్ వైభవం మొఘల్ వాస్తు శిల్పానికి ఉదాహరణ. ఈ ద్వారం ఎర్ర ఇసుకరాయితో తయారు చేశారట.
ఢిల్లీలో నిర్మించిన ఎర్రకోట దాదాపుగా 250 ఎకరాల్లో ఉంటుంది. ఒకప్పుడు దీనికి ఆరు ద్వారాలు ఉండేవట. కానీ ఇప్పుడు ఒకటి మాత్రమే వినియోగంలో ఉంది. దీన్ని లాహోరీ గేట్ అంటారు. ఈ కోటను కట్టడానికి ఏకంగా 10 సంవత్సరాల సమయం పట్టిందట. 1648లో దీని పూర్తి నిర్మాణం కంప్లీట్ అయింది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ ఎర్రకోట మీద భారత ప్రధాని జెండా ఎగురవేస్తారు. ఆ తర్వాత స్పీచ్ ఇస్తారు.
పాత ఢిల్లీలో ఉన్న ఎర్రకోట, పర్షియన్, తైమూరిడ్ హిందూ ప్రభావాలను మిళితం చేసిన మొఘల్ వాస్తుశిల్పానికి ప్రధాన ఉదాహరణగా వివరిస్తారు. కోట రూపకల్పనను తాజ్ మహల్‌ను రూపొందించిన వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ రూపొందించారట. ఎర్రకోటను షాజహాన్ 17వ శతాబ్దం మధ్యలో మొఘల్ సామ్రాజ్య కొత్త రాజధాని షాజహానాబాద్ ప్యాలెస్ కోటగా నిర్మించారు. ఈ కోటను మొదట తెల్లటి ఇసుకరాయితో నిర్మించారు. అయితే ఈ కోటను క్విలా-ఇ-ముబారక్ అని పిలుస్తారు. అంటే దీని అర్థం “దీవించబడిన కోట”.
తెల్ల రాయి పోవడంతో తర్వాత బ్రిటిష్ వారు ఈ కోటకు ఎరుపు రంగు వేశారు. 256 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎర్రకోటను అష్టభుజి ఆకారంలో నిర్మించారు. పై నుంచి చూస్తే, ఈ కోట అద్భుతమైన నిర్మాణ వైభవం దాని అష్టభుజి ఆకారాన్ని వెల్లడిస్తుంది. ఎర్రకోట దాని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా 2007లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితాలో చేరింది. 1648లో ఈ కోట నిర్మాణం పూర్తైంది. దీనికి ఏకంగా కోటి రూపాయలు ఖర్చు అయిందట. ఈ ఎర్రకోట సముదాయం చాలా పెద్దది. దీని గోడలు ఏకంగా 2.5 కి. మీటర్ల పొడవులో ఉంటాయి. ఈ కోట గోడల ఎత్తు యమునా నది వైపు 18 మీటర్లు ఉంటుంది. అంటే వెనుక వైపు ఉంటుంది. అంటే చాందినీ చౌక్ వైపు 33 మీటర్ల ఎత్తులో ఉంటుంది.