https://oktelugu.com/

Work From Home : వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే అన్నింటా విజయమే..

కంప్యూటర్ పై వర్క్ చేసేవారు అయితే సంబంధిత టేబుల్ ను కిటికీ దగ్గర వెంటిలేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా బయటి గాలి వచ్చే వీలు ఉండాలి. అలా ఉండడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండి చికాకు కలిగించదు. దీంతో సిస్టమ్ కూడా హీట్ కాకుండా కూల్ గా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 17, 2024 / 12:17 AM IST

    Work From Home

    Follow us on

    Work From Home  : కరోనా కాలం తరువాత చాలా మంది ఇంటి నుంచే పని చేయడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంస్థలు, కంపెనీలు ఇంటి నుంచి కాకుండా కార్యాలయానికి పిలిపించినా చాలా మంది వర్క్ ఫ్రం హోం కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంటి నుంచి అయితే ఎక్కువ సేపు విధుల్లో ఉండడమే కాకుండా కొన్ని ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా టైం టూ టైం అని కాకుండా కాస్త రిలాక్స్ గా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా మంది ఈ టైప్ ఆఫ్ వర్క్ ను కోరుకుంటున్నారు. అయితే ఇంటి నుంచి పనిచేసే వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. నిత్యం ఇంట్లో ఉండడం వల్ల మానసిక ఆందోళన ను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్యాలయానికి, ఇంటికి చాలా తేడా ఉండడం వల్ల వర్క్ చేయడానికి మనసు సిద్ధంగా ఉండదు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు. ఆ టిప్స్ ఏంటంటే?

    ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రత్యేకమైన గది అంటూ ఉండదు. దీంతో కొన్ని సార్లు బెడ్ పై, మరికొన్ని సార్లు సోపాఫై వర్క్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. వర్క్ ప్లేస్ ఏదో ఒక చోటును ఎంచుకొని నిర్ధిష్టంగా అక్కడే పనిచేయడానికి రెడీ కావాలి. అప్పుడే వాస్తు కలిసి వస్తుంది. అలా కాకుండా మాటి మాటికి ప్లేసులు మార్చడం వల్ల చికాకు కలుగుతుంది. దీంతో మొదలు పెట్టిన పనిని పూర్తి చేయలేరు.

    కంప్యూటర్ పై వర్క్ చేసేవారు అయితే సంబంధిత టేబుల్ ను కిటికీ దగ్గర వెంటిలేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా బయటి గాలి వచ్చే వీలు ఉండాలి. అలా ఉండడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండి చికాకు కలిగించదు. దీంతో సిస్టమ్ కూడా హీట్ కాకుండా కూల్ గా ఉంటుంది. ఇక ఈ సిస్టమ్ టేబుల్ ను మెయిన్ డోర్ కు మధ్యలో వచ్చే విధంగా ఉండకకూడదు. అలాగే తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేస్ ఉండేలా దీనిని ఏర్పాటు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    వర్క్ చేసే టేబుల్ పై ఎలాంటి అనవసర వస్తువులు లేకుండా చూడాలి. ముఖ్యంగా ఇనుము వస్తువులు ఉండడం వల్ల కోపం అధికంగా వస్తుంది. అంతేకాకుండా అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు సైతం లేకుండా చూసుకోవాలి.ఇలా ఉండడం వల్ల చికాకు కలగడమే కాకుండా అనారోగ్యాన బారిన పడుతారు.

    కూర్చునే టేబ్ వద్ద అవసరమైన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ బిజీలో ఉండి వాటర్ తాగడం మరిచిపోతారు. దీంతో అనారోగ్యాన బారిన పడుతారు. శరీరంలో నీటి శాతం తక్కవ కావడంతో మనసు ఉల్లాసంగా ఉండదు. దీంతో ఎక్కువ సేపు పనిచేయలేరు. ఇక వర్క్ ను ప్రారంభించే ముందు కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అంతేకాకుండా వర్క్ చేసినంత సేపు ఇంట్లో వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటే ఫర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం బెటర్. దీంతో సువాసన రావడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.