https://oktelugu.com/

Mobile Technology : ఈ చిన్న ట్రిక్ ద్వారా ఫోన్ ఆన్ లో ఉన్నా కాల్ చేస్తే స్విచ్ఛాప్ వస్తుంది.. ఎలాగో తెలుసుకోండి..

మొబైల్ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అవసరాలు తీర్చడానికి అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తిని గుర్తించడానికి మొబైల్ మాత్రమేవాహకం. ఒక వ్యక్తి ఎక్కడున్నా.. కాల్ చేస్తే గుర్తించవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2024 9:06 pm
    Mobile Technolory

    Mobile Technolory

    Follow us on

    Mobile Technology : మానవ సమాజంపై ప్రస్తుతం మొబైల్ పెత్తనం కొనసాగిస్తోంది. ఎప్పుడైతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయో మనుషుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మొబైల్ ద్వారా అసాధ్యమైన పనులు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. మొబైల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతే నష్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ లేకపోతే జీవితం గడవదు. అయితే మొబైల్ ఎంత పెత్తనం చెలాయించినా వాడే దానిని బట్టి ఉంటుంది. దానిని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటుంది. అంటే ఫోన్ ను అత్యవసర సేవలకు మాత్రమే కాకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో కొందరి ఫోన్ కాల్స్ నుంచి తప్పించుకోవడానికి ఫోన్ ను స్విచ్ఛాప్ చేస్తుంటారు. కానీ దీని వల్ల వేరే ఎవరికైనా కాల్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఫోన్ స్విచ్ఛాప్ చేయకున్నా.. ఒక చిన్న ట్రిక్ ద్వారా అలాంటి వారికి స్విచ్ఛాప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ట్రిక్ ఎలాగో తెలుసుకోండి..

    మొబైల్ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అవసరాలు తీర్చడానికి అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తిని గుర్తించడానికి మొబైల్ మాత్రమేవాహకం. ఒక వ్యక్తి ఎక్కడున్నా.. కాల్ చేస్తే గుర్తించవచ్చు. అయితే కొందరు వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. వారి నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండాలంటే ఫోన్ స్విచ్ఛాప్ చేస్తారు. అయితే ఫోన్ స్విచ్ఛాప్ చేస్తే మరో కాల్ స్వీకరించడానికి అవకాశం ఉండదు.

    ఇలా ఫోన్ ఆన్ లో ఉన్నా స్విచ్ఛాప్ అని కొందరికి రావడానికి ఈ చిన్ని ట్రిక్ ఫాలో కావొచ్చు. ముందుగా మొబైల్ లోని కాల్ యాప్ ను ఓపన్ చేయాలి. ఇందులో కాల్ సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత కాల్ వెయిటింగ్ అనే ఆప్షన్ డిపాల్ట్ గా ఉంటే దానిని డిజేబుల్ చేయాలి. ఆ తరువాత ఫార్వార్డింగ్ కాల్ కు వెళ్లాలి. ఇక్కడ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుంటే ముందుకు వెళ్లాక ‘వెన్ ఫార్వర్డ్ వెన్ బిజీ’ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక నెంబర్ అడుగుతుంది. మీరు ఏ కాల్ నుంచి అయితే ఇబ్బంది పడుతున్నారో.. ఆ నెంబర్ టైప్ చేయాలి. ఆ తరువాత ఎనెబుల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. దీంతో మీరు వద్దనుకునే నెంబర్ కు ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది.

    సాధారణంగా ఒక నెంబర్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని పొందాలి. అయితే దూరంగా ఉండే వ్యక్తుల నెంబర్ అయితే ఇలా చేసుకోవచ్చు. సమీపంలోని వ్యక్తి నెంబర్ ఇలా చేస్తే వారు చెక్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. అవవసరపు కాల్స్, మార్కెటింగ్ కాల్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్ నుఫాలో కావొచ్చు.