Tesla: ‘ఎలన్ మస్క్’.. ఈ పేరు గురించి తెలియని వారు ఉండరేమో..? వరల్డ్ నెంబర్ వన్ బిలియనీర్.. 2020-21 మధ్యకాలంలో ఏకంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి తన ఆస్తులను పెంచేసుకున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించి మస్క్ ఈ రోజు ప్రపంచ బిలియనీర్ల జాబితాల్లో నెంబర్ వన్ స్థాయి సాధించారంటే దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఎలన్ మస్క్ అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త.. ఈయన చాలా వ్యాపారాలు ఉన్నాయి. టెస్లా కార్ల కంపెనీతో మస్క్ చాలా ఫేమస్ అయ్యారు. ఏడాది కిందట తన సొంత సంస్థ ద్వారా ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరిపి ఏకంగా 100కు పైగా శాటిలైట్స్ అంతరిక్ష రంగంలోకి పంపించి సరికొత్త వరల్డ్ రికార్టు క్రియేట్ చేశాడు. ఎంతో ఘన చరిత్ర ఉన్న మస్క్ తన జీవితంలో ఎన్నో టక్కాముక్కీలు తిన్నారు.

కస్టమర్ల ఫిర్యాదులు..
ఎలన్ మస్క్ తన సొంత కంపెనీ అయిన టెస్లాను ఖండాంతారాలకు విస్తరించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇండియానూ టెస్లా కార్లు రానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అందకు సంబంధించి చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది. ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ కారును ఎలన్ మస్క్ పరిచయం చేశారని అంటుంటారు కొందరు. టెస్లా మోటార్ నుంచి అది కూడా విడుదలైంది. గ్లోబర్ వార్మింగ్ సమస్య తీవ్రతరం అవుతున్న తరుణంలో కర్భన ఉద్గారాలు తగ్గించాలని ఐక్యరాజ్యసమితితో పాటు అగ్రరాజ్యం అమెరికా అన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. డీజిల్ మరియు పెట్రోల్ వాడాకాన్ని తగ్గించాలని ప్రకటించాయి. ఈ క్రమంలో విద్యుత్ వాహనం టెస్లా మోటార్స్ నుంచి విడుదలైంది. అయితే, టెస్లా మోటార్స్ మీద ఈ మధ్యకాలంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఏకంగా 30 కేజీల డైనమైట్..
ఈ క్రమంలోనే ఫిన్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి టెస్లా కారు ఉంది. దానికి మరమ్మత్తులు చేయించాలని అతను భావించాడు. సర్వీస్ సెంటర్‌కు వెళ్లి అడుగగా ఏకంగా రూ. 17లక్షలు (మన కరెన్సీ)లో అవుతుందని చెప్పగా అతడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. దీంతో ఆగ్రహించిన సదరు కస్టమర్ ఏకంగా తన కారుకు 30కేజీల డైనమైట్ అమర్చి జనావాసానికి దూరంగా పేల్చిపడేశాడు. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం అది కాస్త తెగ వైరల్ అవుతోంది. ఈ చర్యతో అతను టెస్లా మోటార్స్ యాజమాని ఎలన్ మస్క్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: America: హక్కుల పేరిట అమెరికా అత్యుత్సాహం..!
సాధారణంగా ఏదేని బ్రాండ్ కంపెనీ కారును కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులకు ఫ్రీ సర్వీస్ చేయాలి. లేదా మినిమమ్ సర్వీస్ చార్జెస్ తీసుకుని సేవలు అందించాలి. కానీ ఏకంగా సర్వీసు కోసం వెళితే కొత్త కారు ప్రైజ్ చెబితే ఎవరికైనా మండిపోతుంది. కానీ అందరూ బాంబులు పెట్టి ఈ వ్యక్తిలా పేల్చేయకపోవచ్చు. కోపంతో రగిలిపోవడం మాత్రం ఖాయం. అయితే, టెస్లా మోటార్స్ సంస్థ ఇప్పటికైనా కస్టమర్లకు అనుగుణంగా తమ రూల్స్ మార్చుకుంటే మంచిదని చెబుతున్నారు కొందరు..
Also Read: Elon Musk: అపర కుబేరుడైనా ఒకప్పుడు కష్టాలే.. చిన్ననాటి స్మృతులు నెమరువేసుకున్న మస్క్