Zodiac signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఆరు నెలల పాటు ఒక రాశిలో సంచారం చేస్తుంది. గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా రాశుల వారి జీవితాల్లో ఊహించిన సంఘటనలు చోటు చేసుకోనున్నాయి. 2024 ఏడాది పూర్తయి 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది నుంచి కొత్త పంచాంగం ప్రారంభం అయినప్పటికీ.. నెలల వారీగా పంచాంగ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే కొత్త ఏడాదిలో మిథున రాశిలోకి గురు గ్రహం ప్రవేశించనుంది. మే 14 నుంచి ఎంట్రీ ఇచ్చే గురుడు ఆరు నెలల పాటు సంచరిస్తాడు. ఆ తరువాత అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి, డిసెంబర్ లో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. అవి ఎలా ఉండనున్నాయంటే?
గురు గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించడంతో మేష రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రావి వారు అనుకోకుండా ఆర్థిక లాభాలు పొందుతారు. వీరికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల కోసం చేసే విహార యాత్రలతో లాభాలు వస్తాయి. అనుకోకుండా కొన్ని అదృష్టాలు ఉంటాయి.
వృషభ రాశిపై గురు గ్రహం సంచార ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడులు పెట్టినట్లయితే అధికంగా లాభాలు వస్తాయి.
గురు గ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా సొంత రాశిపై కూడా ప్రభావం ఉండనుంది. ఈ రాశి వారు కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు. వీరు ఏ పని చేపట్టినా విజయాలే వరిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రయాణం మొదలుపెడుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
సింహారాశి వారికి గురు గ్రహం మార్పు ప్రభావం పడనుంది. వీరు ఆరు నెలల కాలంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు విజయం సాధిస్తారు. ఉద్యోగులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం. అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది.
కన్య రాశిలోనూ మార్పులు జరగనున్నాయి. ఈ రాశివారు కష్టపడిన దానికి సరైన ఫలితం పొందుతారు. కొందరు ఉద్యోగాలు మారడానికి ప్రయత్నిస్తారు. దీంతో అవి ఫలితాలనిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
తులా రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అవి లాభాలు ఇస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
ధనుస్సు రాశి వారు విద్యావంతులకు అపార ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త కోర్సుల్లో చేరేవారికి ఇదే మంచి సమయం. ఈ ఏడాది మొత్తం సంతోషంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. గతంలో ఉన్న వ్యాధుల నుంచి బయటపడుతారు.
కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో మెదులుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.