Homeజాతీయ వార్తలుSandhya Theatre Incident : ఈ మీటింగ్ తోనైనా సంధ్య ధియేటర్ ఇష్యూ చల్లబడుతోందా? రేవంత్...

Sandhya Theatre Incident : ఈ మీటింగ్ తోనైనా సంధ్య ధియేటర్ ఇష్యూ చల్లబడుతోందా? రేవంత్ సర్కార్ కాస్త మెత్తబడినట్లేనా?

Sandhya Theatre Incident : పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి 20 రోజుల తర్వాత ఇప్పుడు బాధిత కుటుంబానికి ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు సాయం అందించింది. సోమవారం (డిసెంబర్ 23) ఆ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించారు. అంతేకాదు హాస్పిటల్ కు వెళ్లి రేవతి భర్తకు చెక్కు అందజేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన పై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది.

రెండు మూడు రోజు క్రితం వరకు పీక్‌ లెవల్‌లో ఉన్న ఈ ఇష్యూ.. నెమ్మదిగా మెత్తబడుతున్నట్లు కనిపిస్తోంది. డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం కాంగ్రెస్ పార్టీ.. సర్కార్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఇండస్ట్రీ ఎవరి ఎత్తుల్లో వాళ్లున్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో తగ్గిందెవరు.? నెగ్గిందెవరు.? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. గత 15 రోజులుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట అదే సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట ఘటన. రేవతి అనే మహిళా తొక్కిసలాటలో చనిపోవడం.. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం.. .ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్..బెయిల్..రిలీజ్‌..ఇలా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిపోయింది. తర్వాత నోటీసులు.. పోలీస్ విచారణ అంటూ డైలీ ఎపిసోడ్‌ లాగా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా మారాయి.

అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను కూడా తగ్గేదేలే అన్నట్లుగా అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్‌కు ఇండైరెక్టుగా కౌంటర్‌ ఇవ్వడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. అయితే రోజులు గడుస్తున్నా కొద్ది.. ఈ ఇష్యూ మెల్లగా చల్లబడుతున్నట్లు కనిపిస్తోంది. అటు ప్రభుత్వం నుంచి..ఇటు ఇండస్ట్రీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి సమస్యను కొలిక్కి తెచ్చేలా కీలక అడుగులు పడుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో అధికార కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్‌తో పాటు మిగతా పార్టీలన్నీవ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షలీడర్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో.. కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తం అయింది. కొందరు నేతలు అల్లుఅర్జున్‌తో పాటు ఇండస్ట్రీపై అగ్రెసివ్‌గా మాట్లాడిన తీరుపై పార్టీ ప్రభుత్వ పెద్దలు ఆరా తీశారట. పాపులర్ సినీ హీరో కావడంతో వారి అభిమానులతో పాటు ప్రజల్లోకి తప్పుడు సూచనలు వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. ఇక అల్లుఅర్జున్ ఎపిసోడ్‌లో వెనక్కి తగ్గడం బెటరనే ఆలోచనకు ప్రభుత్వ పెద్దలు వచ్చారట.

ఇక నుంచి ఈ ఇష్యూలో ఇక నుంచి ఎవరూ అగ్రెసివ్‌గా మాట్లాడొద్దని, విమర్శలు చేయొద్దని తమ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారట. ఇక పోతే బాధిత కుటుంబాన్నిపరామర్శించి అల్లు అరవింద్, దిల్‌రాజు 2 కోట్ల రూపాయల సాయం అందజేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నేడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని సీఎం ప్రకటించడంతో టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా దిల్‌రాజు నిర్మించిన గేమ్‌ఛేంజర్‌, సంక్రాతికి వస్తున్నాం, డాకూ మహరాజ్ సినిమాలు సంక్రాతికి విడుదల అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశంతో పాటు బెని ఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే చాలా నష్టపోతామని వారు వాపోతున్నారు . అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీఎం రేవంత్ తో చర్చించి మ్యాటర్‌ సెటిల్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పీక్‌ లెవల్లో కొనసాగిన ఇష్యూ లో కాంగ్రెస్ ప్రభుత్వం మెత్త బడుతుండగా.. అల్లుఅర్జున్ సహా టాలీవుడ్ అంతా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular