Why VT On Indian Planes: మీరు విమానం జర్నీ చేశారా? అయితే ఈ విమానం గురించి చాలా విషయాలను తెలుసుకొని కూడా ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా మీరు ఎక్కేటప్పుడు గనుక విమానాన్ని గమనిస్తే ఒక కోడ్ కనిపిస్తుంది. అదే VT. ఈ కోడ్ ప్రతి భారతీయ విమానం వెనుక లేదా కిటికీల దగ్గర పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. కానీ ఈ ‘VT’ కోడ్ అంటే ఏమిటి? ప్రతి విమానంలో ఇది ఎందుకు రాస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి దీనికి కారణం మనం తెలుసుకుందామా?
‘VT’ కోడ్ అంటే ఏమిటి?
ఈ ‘VT’ కోడ్ బ్రిటిష్ రాజ్‌తో ముడిపడి ఉంది. విన్నాకా షాక్ అయ్యారా? ‘VT’ అంటే “విక్టోరియన్ టెరిటరీ” లేదా “వైస్రాయ్ టెరిటరీ” అని నమ్ముతారు. భారతీయ విమానాల రిజిస్ట్రేషన్ కోసం ఈ కోడ్ అంతర్జాతీయంగా సెట్ చేశారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నియమాల ప్రకారం, ప్రతి దేశ విమానాలు వేరే రిజిస్ట్రేషన్ కోడ్‌ను కలిగి ఉంటాయి. తద్వారా వాటిని గుర్తించవచ్చు.
Also Read: Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమానం అందుకే క్రాష్ అయిందా.. విచారణలో కొత్త ఆధారం
బ్రిటిష్ రాజ్ వారసత్వం
1929లో, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంతో సహా దాని అన్ని కాలనీల విమానాలకు ‘V’ తో ప్రారంభమయ్యే కోడ్‌లను కేటాయించింది. ఆ సమయంలో, భారతదేశానికి ‘VT’ కోడ్ ఇచ్చారు. పాకిస్తాన్‌కు ‘AP’, శ్రీలంకకు ‘4R’, నేపాల్‌కు ‘9N’ అనే కోడ్ కేటాయించారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా, భారతదేశం ఈ కోడ్‌ను మార్చడానికి ప్రయత్నించలేదు. అయితే అనేక ఇతర దేశాలు తమ స్వంత కొత్త కోడ్‌లను స్వీకరించాయి.
‘VT’ కోడ్ మార్చాలని డిమాండ్
‘VT’ కోడ్ బానిసత్వాన్ని సూచిస్తుందని, భారతదేశం స్వతంత్ర గుర్తింపుకు ఇది మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. ఈ కారణంగా, ఈ కోడ్‌ను మార్చాలనే డిమాండ్ చాలాసార్లు లేవనెత్తారు. 2004లో మొదటి ప్రయత్నం కూడా చేశారు. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ‘VT’ కోడ్‌ను మార్చమని ICAOని అభ్యర్థించింది. కానీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 2021లో బాంబే హైకోర్టులో అప్పీల్ కూడా చేశారు. వ్యాపారులు విజయ్‌పత్ సింఘానియా, విజయ్ సేథి ‘VT’ కోడ్‌ను మార్చాలని కోరారు. కానీ ఆ పిటిషన్ కొట్టివేశారు.
2022లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ‘VT’ కోడ్ బానిసత్వాన్ని సూచిస్తుందని, దానిని మార్చాలని అశ్విని ఉపాధ్యాయ్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. డిసెంబర్ 2021లో, కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) విజయ్ కుమార్ సింగ్ రాజ్యసభకు మాట్లాడుతూ, 1927 వాషింగ్టన్ ఇంటర్నేషనల్ రేడియోటెలిగ్రాఫ్ కాన్ఫరెన్స్‌లో భారతదేశానికి ‘VT’ కోడ్ కేటాయించారని చెప్పారు. ‘VT’ అంటే “వైస్రాయ్ టెరిటరీ” అని అర్థం కాదని, భారతదేశానికి సంబంధించిన I, IN, B, BH, BM లేదా HT వంటి ఇతర కోడ్‌లను ఇప్పటికే ఇతర దేశాలకు కేటాయించారని కూడా ఆయన అన్నారు.
Also Read: Air India Plane Crash DVR: కూలిపోయిన విమానం నుండి DVR స్వాధీనం.. ప్రమాదానికి కారణమేంటో?
కోడ్ మార్చడంలో సమస్యలు ఏమిటి?
‘VT’ కోడ్‌ను మార్చడం అంత సులభం కాదు. ఎందుకంటే దీనికి పెద్ద ఎత్తున మార్పులు అవసరం. అన్ని విమానాలకు తిరిగి పెయింట్ వేయవలసి ఉంటుంది. విమానయాన పత్రాలు, అంతర్జాతీయ రికార్డులను నవీకరించవలసి ఉంటుంది.
ఈ ప్రక్రియకు చాలా ఖర్చవుతుంది. విమాన సేవలు కూడా ప్రభావితం కావచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.