Journalist Welfare Delay Telangana: అధికారంలోకి రాగానే పాత్రికేయులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని.. హైదరాబాద్ పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని.. జిల్లాలలోనూ ఇళ్లస్థలాలు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కారణంతో సంబంధం లేకుండా చనిపోయిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం.. విశ్రాంత పాత్రికేయులకు పింఛన్ సదుపాయం కల్పిస్తామని నాడు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. పాత్రికేయుల కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించడానికి హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి 18 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక హామీ కూడా అమలకు నోచుకోలేదు..
Also Read: Congress Schemes: కాంగ్రెస్ 7 పథకాలు.. తెలంగాణలో గేమ్ ఛేంజర్ అవుతుందా?
ఇక ఇళ్ల స్థలాల సమస్యకు సంబంధించి 20 సంవత్సరాలుగా ఆ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మిగతా వాటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా ఆశించినంత చూపించలేకపోతోంది. ఇక ఇళ్ల స్థలాల గురించి ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలోనూ త్వరలో అనే సమాధానాన్ని చెబుతున్నారు. 100 కోట్ల ఫండ్ ఇంతవరకు జమకాలేదు. ప్రభుత్వం ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఇక ఇటీవల రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులకు సొసైటీ భూములకు సంబంధించి నోట్ ఇచ్చారు. ఆ సమయంలో పాత్రికేయులు మొత్తం రేవంత్ రెడ్డిని పొగిడారు. అయితే నోటు ఇవ్వడం వరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగిపోయింది. ఇళ్ల స్థలాల అప్పగింత కార్యక్రమాన్ని ఇంతవరకు చేపట్టలేక పోయింది. మరోవైపు ఈ భూమి జర్నలిస్టుల సొసైటీకి ఇంతవరకు అప్పగించకపోవడంతో సమస్య ఇప్పటివరకు అలానే ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తే భవిష్య నగరిలో కొత్త పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించడం విశేషం.
Also Read: CM Revanth Reddy Gaddar Awards 2025: సీఎం రేవంత్ జాతకాలు: 100కు వందశాతం నిజమవుతున్నాయే?
కొత్త గుర్తింపు కార్డులు ఏవీ?
ఇంతవరకు జర్నలిస్టులకు కొత్తగా గుర్తింపు కార్డులను ప్రభుత్వం జారీ చేయలేదు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నూతన కార్డులు మంజూరు చేయలేకపోవడం పట్ల పాత్రికేయులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.. కొత్తగా గుర్తింపు కార్డులు మంజూరు చేయకపోవడంతో పాత్రికేయులలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇదే సమయంలో కొత్త పాత్రికేయులకు గుర్తింపు కార్డులు లేకపోవడంతో అనేక సందర్భాలలో వారు ఇబ్బంది పడుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు గుర్తింపు కార్డు ప్రామాణికం కావడంతో నూతన పాత్రికేయులు ఆ వార్తలను కవర్ చేయడంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక హెల్త్ కార్డుల విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఐదు లక్షల పరిహారం అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే పాత్రికేయుల సమస్యలు ఎలా ఉన్నాయి. మరి వీటి పరిష్కారానికి రేవంత్ రెడ్డి ఎలాంటి చొరవ చూపుతారనేది చూడాల్సి ఉంది.