Soap Foam: ఉదయం లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వరకు చాలా పనులు చేస్తుంటాము. కానీ కొన్ని పనుల వెనుక రహస్యాలు మాత్రం గమనించము. కొన్ని సార్లు వేటి గురించి ఆలోచించకుండానే జీవితం గడిచిపోతుంటుంది. నీరు తెల్లగానే ఎందుకు ఉంటుంది. భూమి మీద ఎన్ని ప్రాణులు నివసిస్తున్నాయి? ఈ జీవకోటికి మూలం ఏంటి వంటి చాలా ప్రశ్నలు ఎందరినో తొలుస్తుంటాయి. అందులో కొందరు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే కొందరికి మాత్రం ఆసక్తి ఉండదు.
ముఖ్యంగా రోజు వారి ఉపయోగాలలో కొన్ని ఎందుకు అదే విధంగా జరుగుతాయి అనే వివరాలు మాత్రం తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. మీరు ఉదయం లేచిన తర్వాత మొహం కడుక్కొని స్నానం చేసి తిరిగి సాయంత్రం స్నానం చేయడానికి వాడే సబ్బు నురగ తెల్లగానే ఉంటుంది. బట్టలు పిండి, గిన్నెలు తోమడానికి ఉపయోగించే సబ్బు కూడా నురుగు కూడా తెల్లగానే ఉంటుంది. మరి దీనికి కారణం ఏంటి అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
సబ్బు ఏ రంగులో ఉన్న నురుగు మాత్రం తెల్లగానే ఉంటుంది. ఏదైనా కాంతి అన్ని రంగులను గ్రహిస్తే అది నల్లగా కనిపిస్తుందట. ఆ సమయంలో కాంతి అన్ని రంగులు ప్రతిబింబిస్తే లేదా ఆ వస్తువు ద్వారా గ్రహించబడకపోతే దాని రంగు తెల్లగా కనిపిస్తుందట. సబ్బు మీద పడే కాంతి అన్ని రంగులను ప్రతిబింబించేలా చేస్తుంది. అయితే సబ్బు మారుతున్నా సరే దాని నురుగు మాత్రం మారదు. నురుగు గాజు రూపాన్ని అంటే బుడగల కాంతిని ప్రతిబింబించే అవకాశం ఉంటుందట. అందుకే సబ్బు నురగ తెల్లగా మాత్రమే ఉంటుంది.