Soap Types: సబ్బు.. మన నిత్యం సబ్బుతో స్నానం చేస్తుంటాం. మార్కెట్‌లో దొరికే సోప్స్‌లో.. స్మెల్ చూసి లేదా యాడ్స్ చూసి 80 శాతం మంది సబ్బులు కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఆ సబ్బులు మంచివా కాదా అనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో షాప్‌లో ఏ సోప్ ఇస్తే అదే బాగుందనుకుంటారు. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు దేశంలో 70 శాతం మంది టాయిలెట్ సోప్‌తో స్నానం చేస్తున్నారు. చదువుకున్నవారు కూడా వాస్తవం తెలుసుకోవడం లేదు. అందేటీ అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి.
ఇవన్నీ టాయిలెట్ సోప్‌లే..
స్నానం చేసిన తర్వాత మన శరీరం తెల్లగా అయిపోవడం, చర్మంపై గీతలు పడడం, పొడిబారడం గమనిస్తాం. ఇదంతా మనం వాడే సబ్బుల వల్లనే జరుగుతుంది. ఇలాంటి సబ్బులను టాయిలెట్స్, ఫ్లోర్ క్లీనర్స్‌గా వాడతారు. మరి ఎలాంటి సబ్బుతో స్నానం చేయాలో చూదాం.
ఇవి బాత్ సోప్స్..
సబ్బుల్లో మూడు రకాలు.. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వీటిని వ ఇభజించారు. టీఎప్‌ఎం ఆధారంగా మనం వాడే సోప్స్ ఎంత మంచివో నిర్ధారించబడింది. టీఎఫ్‌ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. టీఎఫ్‌ఎం విలువ 76 శాతం అంతకన్నా ఎక్కువగా ఉంటే వాటిని చాలా నాణ్యమైన సబ్బులుగా గుర్తించారు. ఇవి మన స్నానానికి చాలా మంచివి. తర్వాత టీఎఫ్‌ఎం విలువ 70 శాతం ఉన్నవి కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ఇవి కూడా మన శరీరానికి మంచివే. ఇక టీఎఫ్‌ఎం 60 శాతం ఉన్న సబ్బులు కూడా ఉన్నాయి. ఇవి కూడా మన శరీరానికి ఎలాంటి హాని చేయవు.
ప్రతీ సబ్బు వెనక వివరాలు..
ఇక మార్కెట్‌లో అందుబాటులో ఉండే ప్రతీ సబ్బు వెనక దాని టీఎఫ్‌ఎం విలువ ముద్రించి ఉంటుంది. బాడీ సోఫ్ కొనుటప్పుడు తప్పనిసరిగా దీనిని చూసుకోవాలి. మనం కొనే సబ్బు గ్రేడ్ వన్ లేదా గ్రేడ్–2, గ్రేడ్ –3 అని తెలుసుకోవచ్చు. గ్రేడ్ –2 గ్రేడ్ – సబ్బులు స్నానానికి పనికిరావు. టీఎఫ్‌ఎం విలువ ఎంత ఎక్కువగా ఉంటే మన చర్మం అంత మృదువుగా ఉంటుంది. డ్రై అయిపోవడం, తెల్లగా కావడం, పొడిబారడం జరుగదు.
టీఎఫ్‌ఎం ఎక్కువగా ఉన్న సబ్బులు..
ఇక టీఎఫ్‌ఎం ఎక్కువగా ఉన్న సబ్బులు మార్కెట్‌లో ఏవంటే.. మొదటి వరుసలో మైసూర్ శాండల్, తర్వాత సింతాల్, సుపీరియా సిల్క్, పార్క్ అవెన్యూ, గోద్రెజ్ నం.1, గోద్రెజ్ ఫెయిన్ గ్లో ఇవి మాత్రమే టీఎఫ్‌ఎం 75 కన్నా ఎక్కువగా ఉన్నాయి. మిగతావన్నీ తక్కువ ఉన్నవే. మీరు ఏగ్రేడ్ సోప్ వాడుతున్నారో తెలుసుకోండి. ఇకపై టీఎఫ్‌ఎం ఎక్కువగా ఉన్న సబ్బులు కొనుక్కొండి.