https://oktelugu.com/

Black thread to leg : కాళ్లకి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు? కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

నల్ల దారం కాళ్లకు కట్టడం వల్ల శని, దిష్టి దోషాలు తొలగిపోతాయి. అయితే ఎడమ కాళ్లకు కట్టడం వల్ల దిష్టి పోతుంది. మనం అందంగా రెడీ అయిన, బాగా బతుకుతున్న చాలా మందికి మన మీద ఈర్ష్య ఉంటుంది. వీటి వల్ల మనకు నష్టం కలుగుతుందని భావించి ఇలా నల్ల దారం కట్టుకుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 17, 2024 / 02:19 AM IST

    Black thread to leg

    Follow us on

    Black thread to leg : చాలా మంది ఈరోజుల్లో కాళ్లకు, చేతులకు నల్ల దారం కడుతుంటారు. ఇలా కట్టడం వల్ల దిష్టి తగలదని చాలా మంది భావిస్తారు. అయితే కాళ్లకు ఇలా నల్ల దారం కట్టడం వల్ల నిజంగా దిష్టి తగలదా. వీటి వల్ల ఏవైన ప్రయోజనాలు ఉన్నాయా అని చాలా మంది సందేహాపడుతుంటారు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. మరి ఇందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం.

    నల్ల దారం కాళ్లకు కట్టడం వల్ల శని, దిష్టి దోషాలు తొలగిపోతాయి. అయితే ఎడమ కాళ్లకు కట్టడం వల్ల దిష్టి పోతుంది. మనం అందంగా రెడీ అయిన, బాగా బతుకుతున్న చాలా మందికి మన మీద ఈర్ష్య ఉంటుంది. వీటి వల్ల మనకు నష్టం కలుగుతుందని భావించి ఇలా నల్ల దారం కట్టుకుంటారు. అయితే అబ్బాయిలు కుడి కాళ్లకు లేదా చేతులకు, అమ్మాయిలు ఎడమ కాళ్లకు లేదా చేతులకు కట్టుకుంటే ప్రయోజనాలు ఉంటాయి. నల్ల దారం కట్టుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి సమస్యలు రావు. వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఎక్కువగా నల్ల తాడు, పూసలు వంటివి కాళ్లకు, చేతులకు కడతారు. ఇలా కట్టడం వల్ల పిల్లలకు దిష్టి తగలకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కొందరు నడుముకి నల్ల తాడు కడతారు. ఇలా చేయడం వల్ల నడుము సమస్యలు రాకుండా.. కొన్ని వ్యాధులు కూడా రావని చాలా మంది నమ్ముతారు.

    కొందరికి శని దోషం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి పనులు కూడా సరిగ్గా జరగవు. అయితే నల్ల తాడు కాళ్లకి కట్టుకోవడం వల్ల శని దోషం నుంచి విముక్తి కలుగుతుందని పండితులు అంటున్నారు. కొందరికి ఏలినాటి శని ఉంటుంది. అలాంటి వాళ్లకి ఈ నల్ల తాడు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న వాళ్లకి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. కొందరు బయటకి చాలా ప్రేమగా ఉంటారు. కానీ మనసులో కుళ్లు, కుతంత్రాలతో ఉంటారు. ఇలాంటివి పడకుండా ఉండాలని చాలా మంది నల్ల తాడు కట్టుకుంటార. నరదిష్టికి నల్ల తాడు బాగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. కాళ్లకు నల్ల దారం కట్టడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నల్ల దారం వల్ల లైఫ్ లో పాజిటివ్ వస్తుందని చాలా మంది నమ్మకం. అయితే ఈ నల్ల దారాన్ని మంగళవారం కాళ్లకు కట్టుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.