https://oktelugu.com/

Sprouts: మొలకలు తింటున్నారా? ఎప్పుడు తింటున్నారు? ఇంతకీ శుభ్రంగా ఉన్నాయా?

మొలకల్లో చాలా పోషకాలు లభిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే కేలరీస్ తక్కువ తీసుకోవచ్చు. మొలకల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి సరిగ్గా జరిగి జీర్ణ సమస్యలు రావు. మరి ఈ మొలకలను ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవద్దు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 17, 2024 / 03:00 AM IST

    Sprouts

    Follow us on

    Sprouts: మొలకలు ఆరోగ్యానికి మంచివే కానీ ఏ టైమ్‌లో తీసుకోవాలో తెలుసుకోవడం మరీ మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిని బ్రేక్‌ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం టైమ్‌లో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అందుతాయట. ఎందుకంటే, వీటిని తినడం వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది. రోజంతా మీ పనులని మీరు హ్యాపీగా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నీరసం దరిచేరదు.

    కొంతమంది మొలకల్ని రాత్రుళ్ళు డిన్నర్ టైమ్‌లో తీసుకుంటారు. కానీ, ఇది అస్సలు మంచిది కాదు ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే చాలా జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ పట్టేసినట్లు అనిపిస్తుంది. దీనివల్ల నిద్ర కు ఆటంకం కలుగుతుంది. సాధారణంగా మొలకల్లో రిచ్ న్యూట్రియెంట్స్ లభిస్తాయి కాబట్టి వీటిని సరైన సమయానికి తినడం వల్ల రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అదే రాత్రుళ్ళు తింటే మాత్రం నిద్రపట్టదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటిని సాయంత్రాలు, రాత్రుళ్ళు తింటే ఇక నుంచి మానుకోవడం బెటర్.

    మొలకల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని ఉదయాన్నే తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారికి గ్యాస్ బయటికి వెళ్తుంది. దీని వల్ల కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. వీటిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టైమ్‌లో తింటే కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. నిజానికీ మొలకలు తిన్నప్పుడు గ్యాస్ సమస్య కొందరికి వస్తుంది. కానీ మోతాదులో తింటే మాత్రం ఈ సమస్య రాదట. అదే విధంగా.. ఈ నెగెటీవ్ ఎఫెక్ట్స్ కంటే పాజిటీవ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మొలకలు తినడానికి చాలా మంది మొగ్గు చూపిస్తుంటారు.

    ఇక మొలకలను ఉదయాన్నే తినడం చాలా మంచిది. వీటిని ఉదయాన్నే తింటే ఎనర్జీగా ఉంటుంది. పోషకాలు కూడా ఇందులో మెండుగానే ఉంటాయి.అంతేకాదు కాల్షియం, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియంల మిశ్రమం మొలకలు. కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేస్తే మీరు ఎనర్జీగా ఉంటారు. పనులు కూడా చకాచక్ చేసుకుంటారు. కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి అనవసరపు జంక్ ఫుడ్ తినాలి అనే కోరిక రాదు.అంటే బరువు కూడా పెరగరు.

    ఉదయం మొలకలను ఓట్స్, గుడ్లు, శాండ్‌విచ్ వంటి ఫుడ్స్‌తో కలిపి తీసుకోండి. తినాలి అనిపిస్తుంది. అయితే, కొంతమంది జిమ్‌కి వెళ్ళేముందు కూడా తింటుంటారు. దీని వల్ల పోషకాలు అందుతాయి కానీ జీర్ణమవ్వడానికి సమయం పడుతుంది. అందుకే, జిమ్‌కి వెళ్లేకంటే కొన్ని గంటల ముందు తినడం వల్ల సరిగ్గా జీర్ణమవుతాయి. వర్కౌట్స్ చేయడం కూడా సులభం అవుతుంది. అదే జిమ్‌ నుంచి వచ్చాక తింటే అలసిపోయిన కండరాలు, శరీరానికి పోషకాలు ఫుల్ గా అందుతాయి. లేదంటే మీరు లంచ్ లో తిన్నా ఒకే.

    మొలకలు హెల్దీ కానీ కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి. అలాకాకుండా ఉండాలంటే అందులో బ్యాక్టీరియాలు లేకుండా జాగ్రత్త పడాలి. తినేముందు క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు. తాజావే తీసుకోవడం వల్ల సమస్య ఉండదు. బయట కొనుక్కుంటే కచ్చితంగా అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.