Leggings: ఈ లెగ్గింగ్స్ వేసుకుంటున్నారా? ఫ్యాషన్ గా ఉండాలంటే ఇవి పాటించండి. అందంగా కనిపిస్తారు.

టాప్ ఏ కలర్‌లో ఉంటుందో అదే కలర్ లెగ్గింగ్ వేసుకుంటారు చాలా మంది. కానీ ఇలా వేసుకోవద్దు. ఇలా వేసుకోవడం వల్ల అట్రాక్ట్ గా కనిపించరు. కాంట్రాస్ట్ కలర్స్ వేయడం వల్ల లుక్ ఎలివేట్ అవుతుంది అంటున్నారు నిపుణులు.

Written By: Swathi Chilukuri, Updated On : September 16, 2024 11:34 am

Leggings

Follow us on

Leggings: జీన్స్ కంటే చాలా మంది అమ్మాయిలు డ్రెస్ లలో చాలా అందంగా కనిపిస్తారు. ఇక చీరల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లంగా ఓణీ, మిడ్డీ, ఫ్రాక్, గాగ్రా వంటి చాలా బట్టలు అమ్మాల అందాన్ని పెంచుతాయి. సంప్రదాయం, చూడటానికి లక్ష్మీ కల వస్తుంది. ఇక ఇవన్నీ వేసుకున్నా సరే. చాలా డ్రెస్ ల మీద లెగ్గింగ్స్ వేసుకోవడం కామన్. చుడిదార్, పంజాబీ వంటి డ్రెస్ లో మీద లేడీస్ ఎక్కువగా లెగ్గింగ్స్ వేస్తుంటారు. అయితే, వీటిని వేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాషన్ మిస్టేక్స్ ను పట్టించుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుని పర్ఫెక్ట్ లెగ్గింగ్ ను వేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

టాప్ ఏ కలర్‌లో ఉంటుందో అదే కలర్ లెగ్గింగ్ వేసుకుంటారు చాలా మంది. కానీ ఇలా వేసుకోవద్దు. ఇలా వేసుకోవడం వల్ల అట్రాక్ట్ గా కనిపించరు. కాంట్రాస్ట్ కలర్స్ వేయడం వల్ల లుక్ ఎలివేట్ అవుతుంది అంటున్నారు నిపుణులు. అంతేకాదు ఒకటి కంటే ఎక్కువ కలర్స్ ఉన్న లెగ్గింగ్స్ వేయడం వల్ల చూడటానికి బాగుండదు. మరీ ముఖ్యంగా ప్లెయిన్ టాప్ పైకి వీటిని వేసుకుంటే అసలు బాగోదు. అందుకే ఇలాంటి ఫ్యాషన్ మిస్టేక్స్ చేయకండి.

చుడిదార్, పంజాబీ వంటిమీదకి లేడీస్ ఎక్కువగా లెగ్గింగ్స్ వేస్తుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీటిని వేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాషన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల మీకు పర్వెక్ట్ గా సూట్ అవుతాయి. అవేంటో తెలుసుకుని పర్ఫెక్ట్ లెగ్గింగ్ స్టైల్ ఎలా చేయాలో తెలుసుకోండి. నేటి ఫ్యాషన్ ట్రెండ్స్‌లో యాంకిల్ కట్ లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, మొత్తం కాలుని కవర్ చేసే లెగ్గింగ్స్ వేస్తేనే లుక్ బెటర్ గా కనిపిస్తుంది. అంటే యాంకిల్ కట్ కాలును కవర్ చేసేలా ఉండాలి అన్నమాట. అలా అని మరీ పొడువుగా ఉండవద్దు. ఎక్కువగా పొడుగ్గా లేనివి, అలా అని పొట్టిగా లేనివి తీసుకోండి.

లూజ్ టాప్ వేసుకుని లెగ్గింగ్స్ వేసుకుంటే కూడా అసలు బాగోదు. మరీ టైట్‌గా ఉండేలా వేసుకోవడం వల్ల కూడా బెటర్ గా కనిపించదు. అలా అని మరీ లూజ్‌గా ఉంటే కూడా బాగోదు. నార్మల్ కుర్తీలపైకి లెగ్గింగ్స్ వేసుకోవాలి. ఆడవారు స్కిన్ కలర్ లెగ్గింగ్స్ వేస్తారు. అయితే ఇలా చేయడం చాలా రాంగ్ సెలక్షన్ అంటున్నారు నిపుణులు. అలా వేసుకోవడం కరెక్ట్‌ కాదు.

షార్ట్ టాప్ వేసుకుని వాటిపైకి లెగ్గింగ్ వేసుకుంటే కూడా సరికాదట. మోకాళ్ళని కవర్ చేసే టాప్స్, కుర్తాలపైకి లెగ్గింగ్స్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు. యాంకిల్ కట్ కూడా కాళ్ళు కవర్ అయ్యేలా చూడాలి. కొన్ని సార్లు పర్సనాలిటీని బట్టి మీకు కొన్ని సెట్ అవవచ్చు. కొన్ని సెట్ కాకపోవచ్చు. సో మీ పర్సనాలిటీని బట్టి మీరు లెగిన్స్ ను టాప్స్ ను వేసుకోవడం బెటర్. డ్రెస్ లు కూడా అదే విధంగా సెలక్షన్స్ చేసుకోండి.