After Marriage: మహిళలు ఒక్కో స్టేజ్‌లో వాళ్ల బాడీలో మార్పులు చూస్తారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత వాళ్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందులో ఒకటి బరువు పెరగడం. అయితే పెళ్లి అయిన తర్వాత వాళ్ల శరీరంలోని హార్మోన్ల మార్పులు వల్ల ఎక్కువ మంది అమ్మాయిలు బరువు పెరుగుతారు. దీనికి కారణం శృంగారం అని చాలా మంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పుల వల్ల బరువు పెరుగుతారని అంటున్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి? ఏ ఏ కారణాల వల్ల మహిళలు పెళ్లి అయిన తర్వాత బరువు పెరుగుతారో తెలుసుకుందాం.
పెళ్లి తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో వాళ్లకి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఈ కారణంగా బరువు పెరుగుతారు. అలాగే పెళ్లయ్యాక ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి వల్ల తప్పనిసరిగా బరువు పెరుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈరోజుల్లో చాలామంది పెళ్లి అయిన తర్వాత బయటకు ఎక్కువగా వెళ్తుంటారు. బయట ఫుడ్ తినడం వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కలయిక వల్ల బరువు పెరుగుతారని సైంటిఫిక్‌గా ఇంకా ఫ్రూఫ్ కాలేదు. కానీ కలయిక తర్వాత ఆకలితో అతిగా తినడం వల్ల బరువు అధికంగా పెరుగుతున్నారు. పెళ్లయిన తర్వాత చాలామందిలో జీవక్రియ రేటు తగ్గిపోతుంది. దీనివల్ల ఒక్కసారిగా బరువు పెరుగుతారు. పెళ్లియ్యాక మహిళల రోజూ దినచర్య మారిపోతుంది. పెళ్లికి ముందు కొందరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటారు. కానీ పెళ్లయిన తర్వాత అంతా వదిలేసి కేవలం భర్తను చూసుకోవడానికి ఇంట్లో ఉండిపోతారు. దీంతో వాళ్లు రోజూ ఒకే దినచర్యను ఫాలో అవుతారు.
మహిళలు ఇంట్లో ఉండటం వల్ల ఆహారం తిన్న వెంటనే కొన్నిసార్లు నిద్రపోతారు. ఇలా చేస్తే తప్పకుండా బరువు పెరుగుతారు. దీనికి తోడు అందరు తిన్న తర్వాత ఏదైనా పదార్థం కొంచెం మిగిలిపోతే.. వేస్ట్ చేయడం ఎందుకని వాళ్లే తినేస్తారు. కొంతమందికి నిద్రలేమి వల్ల ఆకలి కోరికలు బాగా పెరుగుతాయి. దీనివల్ల ఆకలిని అదుపు చేసుకోలేరు. సమయం సందర్భం లేకుండా తింటుంటారు. దీంతో బరువు పెరుగుతారు. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి. కుటుంబ బాధ్యలతో బిజీ అయిపోయి కొంతమంది మహిళలు అసలు వాళ్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. కనీసం వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయరు. వీటివల్ల నడుము, కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల వాళ్లు బరువు పెరుగుతారు. అంతే కానీ తరచుగా శృంగారం చేయడం, కలయికలో పాల్గొనడం వల్ల బరువు పెరుగుతారని అనుకోవడం అపోహ మాత్రమే. ఇందులో ఎలాంటి నిజం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. పెళ్లయిన తర్వాత బరువు పెరగకుండా ఉండాలంటే తినే ఆహారంలో మార్పులు చేయడంతో పాటు వ్యాయామం చేస్తే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.