https://oktelugu.com/

Gates of the Hell: ‘గేట్ వే ఆఫ్ వెల్’ను మూసేస్తారా? దీని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది?

మధ్య ఆసియాలోని కారకూమ్ ఎడారిలో ఏర్పడిన అగ్ని గొయ్యి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంది. కానీ దీని వల్ల భవిష్యత్ లో ప్రమాదం ఉండే అవకాశం ఉందని..

Written By:
  • Srinivas
  • , Updated On : August 31, 2024 5:00 pm
    Turkmenistan mysteriousm flaming Gates of Hell

    Turkmenistan mysteriousm flaming Gates of Hell

    Follow us on

    Gates of the Hell: కొన్ని ప్రకృతి విపత్తులు కొత్తగా అనిపిస్తాయి. ఇవి మనిషి సృష్టించకపోయినా ఆటోమేటిక్ గా ఏర్పడుతాయి. భూమ్మీద ఉండే సహజ వనరుల్లో ఒక్కోసారి కొన్ని విపత్తులకు గురవుతూ ఉంటాయి. ఇవి తాత్కాలికంగా ప్రమాదం కాకపోయినా భవిష్యత్ లో వీటి వల్ల నష్టాలు ఉంటాయని కొందరు భావిస్తుంటారు. మధ్య ఆసియాలోని కారకూమ్ ఎడారిలో ఏర్పడిన అగ్ని గొయ్యి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంది. కానీ దీని వల్ల భవిష్యత్ లో ప్రమాదం ఉండే అవకాశం ఉందని, అందువల్ల దీనిని పూడ్చివేయాలని కొందరు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇంతకీ ఈ అగ్నిగొయ్య కథేంటి?

    మధ్య ఆసియాలోని తూర్క్ మెనిస్థాన్ లో ‘దర్వాజా’ అని పిలిచే ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఇది అగ్ని శిలలతో ఉండడం వల్ల దీనిని నరకదారి అనికూడా పిలుస్తున్నారు. దాదాపు 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో ఉన్న ఈ గొయ్యిలో మిథేయ్ వాయువు విడుదల అవుతుంది. దీనిని ‘గేట్స్ ఆఫ్ హెల్’ అని కూడా పిలుస్తారు. అయితే ఇది చూడ్డానికి ఆకర్షణీయింగా ఉండడంతో దీనిని పర్యాటక ప్రదేశంగా మార్చారు. కానీ దీనిని చూడాలంటే మాత్రం సూదూరం నుంచే సాధ్యమవుతుంది. పర్యాటకులు ఇక్కడికి వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు.

    ఈ మండుతున్న గొయ్యి 1971లోనే ఏర్పడిందని కొందరు చెబుతున్నారు. సోవియట్ యూనియన్ హయాంలో గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తుండగా.. ఆ ప్రయత్నం విఫలమైన అక్కడ అగ్ని శిలలు బయటపడ్డాయని చెబుతున్నారు. 2013లో కెనడాకు చెందిన జార్జ్ కౌర్ నోయిన్ దీని లోతు ఎంత ఉంటుందో అంచనా వేసి చెప్పాడు. అంతేకాకుండా ఇది 1960లోనే ఏర్పాడి అగ్ని శిలలు ప్రారంభమయ్యాయని మరికొందరు చెబుతున్నారు. దీనిని 2018లో ‘షైనింగ్ ఆఫ్ కారకూమ్’ గా పేరు మార్చారు.

    అయితే తుర్కుమెనిస్థాన్ దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతం గుండా గ్యాస్ ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. అలాగే పర్యావరణ కారణాలతోనూ దీనిని ఆర్పేయాలని కోరుతున్నారు. 2022లో ఆయన తూర్కు మెనిస్థాన్ అధ్యక్షుడు బెర్డిముఖమెడోవ్ మాట్లాడుతూ ఈ అగ్ని గుండం కారణంగాన విలువైన సంపదను కోల్పోతున్నామని అన్నారు. అందువల్ల ఈ లోయను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.

    మధ్య ఆసియాలో ఏర్పడిన ఈ గొయ్యి ద్వారా ఎటువంటి ప్రమాదం లేదనికొందరు చెబుతున్నారు. ఎందుకంటే సోవియట్ కు సహజ వాయువులు, ఇంధన కొరత లేదని, ఏటా 7 లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేస్తారని నిపుణులు అంటున్నారు. అలాంటప్పుడు దీనిని మూసేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఏటా 16 వేల వరకు క్యూబిక్ మీటర్ల సహజవాయువును వినియోగించుకునేవి. దీని కంటే నాలుగు రేట్లు ఉత్పత్తి చేయడం సోవియట్ కు పెద్ద విషయం కాదని అంటున్నారు. మరోవైపు జార్జ్ పరిశోధనా బృందంలోని మైక్రో బయాలజిస్ట్ స్టీఫెన్ గ్రీన్ మాట్లాడుతూ మీథేన్ ను వాతావరణంలో కలిసిపోనివ్వడం మంచిది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.