Children prefer father: సాధారణంగా అబ్బాయిలకు అమ్మ అంటే ఇష్టం ఉంటుంది. అమ్మాయిలకు నాన్న అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు అందరితో ఒకేలా ఉంటారు. అదే పెద్దయ్యిన తర్వాత అమ్మతో కంటే నాన్నతో ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. మనకి కావాల్సిన అన్నింటిని కూడా తయారు చేసి పెడుతుంది. కానీ మనకి అమ్మ కంటే నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. తండ్రితో చాలా క్యూట్‌గా ఉంటారు. కానీ అమ్మలతో అయితే కాస్త గొడవలు పడుతూ ఉంటారు. అమ్మని చిరాకు పెట్టడం, పనుల్లో ఆటంకాలు చేయడం, ఏడిపించడం వంటివన్ని పిల్లలు చేస్తుంటారు. ఏదో విధంగానైనా అమ్మలను ఏడిపిస్తారు. అదే నాన్నలను అయితే సంతోష పెడతారు. సరదాగా వారితో ఉంటారు. పిల్లలకు ఏదైనా కావాలన్నా కూడా అమ్మని కంటే నాన్ననే ఎక్కువగా అడుగుతారు. అసలు పిల్లలు అమ్మలతో కంటే నాన్నలతో బాండింగ్ ఎందుకు పెట్టుకుంటారు? దీనికి గల కారణాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
సరదాగా ఆడిపిస్తారు..
అమ్మలు ఇంట్లో పనులు, పిల్లల పనులు అన్నింటిలో బిజీ అయిపోయి పిల్లలను ఆడిపించరు. కొన్నిసార్లు వారి మీద చిరాకు కూడా అవుతారు. కానీ నాన్నలు అలా కాదు. ఎంత వర్క్ టెన్షన్ నుంచి వచ్చిన కూడా పిల్లలతో ఆడుకుంటారు. వాళ్లని ఆడిపించడం, బయటకు తీసుకెళ్లడం వంటివన్నీ చేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మతో కంటే నాన్నతో ఎక్కువగా బంధం ఏర్పడుతుంది.
నాన్నలు అంతగా కంట్రోల్ చేయరు..
సాధారణంగా అమ్మలు ప్రతి విషయంలో కంట్రోల్ చేస్తూ.. రూల్స్ ఎక్కువగా పెడతారు. పొరపాటున పిల్లలు చాక్లెట్ కావాలన్నా వద్దు, తినకు, మంచిది కాదని అంటారు. కానీ నాన్న అలా కాదు. పిల్లలు అడిగారని తినిపించడానికి ట్రై చేస్తారు. కొన్నిసార్లు అమ్మకు తెలియకుండా కూడా పిల్లలకు తినిపిస్తారు.
సపోర్ట్ చేయడం..
పిల్లలు ఏం చేసినా నాన్నలు సపోర్ట్ చేస్తారు. తర్వాత ఏం జరిగిన పర్లేదు. కానీ ప్రయత్నించు అని తండ్రి అంటారు. కానీ అమ్మ మాత్రం ఏదైనా జరుగుతుందని భయంతో ముందే పిల్లలకు వద్దని చెబుతుంది.
ప్రాక్టీకల్‌గా ఎలా ఉంటుందో చూపించడం..
లైఫ్‌లో జరిగిన ప్రతి విషయాన్ని తండ్రి చిన్నప్పటి నుంచి ప్రాక్టీకల్‌గా నేర్పిస్తారు. తీసుకునే ప్రతి స్టెప్ ఎలా ఉంటుందనే కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని ప్రాక్టీకల్‌గా తెలిసేలా చేస్తాడు.
స్వేచ్ఛ
ప్రతి విషయంలో అమ్మలకు కాస్త భయం ఉంటుంది. కానీ నాన్న అలా కాదు. జీవితంలో అన్ని తెలియాలని అనుకుంటారు. అందుకే పిల్లలకు నాన్న ఇచ్చినంత ఫ్రీడమ్ అమ్మ ఇవ్వదు. అమ్మతో కొన్ని విషయాలు చెప్పుకోవడానికి భయపడతారు. కానీ నాన్న దగ్గర అలా కాదు. అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటారు.
ప్రొటెక్టర్..
నాన్న ప్రతి విషయంలో ప్రొటెక్టర్‌గా ఉంటారు. అలాగే పిల్లలతో చాలా ఫన్‌గా ఉంటారు. ఏదైనా తప్పు చేసిన అమ్మలా తిట్టకుండా నాన్న పిల్లలకు అర్థమయ్యేలా చెబుతారు. చాలామందికి వాళ్ల నాన్న ఒక రోల్ మోడల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తునే ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లలను మాత్రం గొప్ప స్థాయిలో పెంచడానికి కష్టపడుతుంటారు. అయితే ఇలా అందరూ పిల్లలు కూడా నాన్న అంటే ఇష్టపడరు. కొందరు మాత్రమే నాన్నతో ఇలా ఉంటారు. మరికొందరు అయితే కనీసం నాన్న దగ్గరికి కూడా వెళ్లడానికి భయపడతారు. మరి మీ నాన్నతో అనుబంధం ఎలా ఉంది? మీరు అమ్మ సపోర్ట్? లేదా? నాన్న సపోర్ట్? కామెంట్ చేయండి.