https://oktelugu.com/

Flight: ఈ కాయను విమానంలోకి అస్సలు అనుమతించరు తెలుసా?

Flight: మంచి మార్కులు వస్తేనే వెళ్లాలి అనుకునేదాంట్లో సీట్ వస్తుంది. లేదంటే అంతే సంగతులు. అందుకే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 18, 2024 1:43 pm
    Coconut not allowed in flight

    Coconut not allowed in flight

    Follow us on

    Flight: పోటీ, పోటీ, పోటీ ఎక్కడ చూసినా పోటీనే ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి రంగంలో ప్రతి విషయంలో పోటీ ఉంటుంది. స్కూల్ కు వెళ్లాలంటే పరీక్ష పాస్ అవ్వాలి. పెద్ద చదువులు చదవాలంటే, ఉద్యోగంలో చేరాలంటే, వ్యాపారాలు చేయాలన్నా ఇలా ఏం చేయాలన్నా పోటీ మాత్రం పక్కా. మరి దీని కోసం కొన్ని పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్ లు ఉంటాయి. అందులో మంచి మార్కులు వస్తేనే వెళ్లాలి అనుకునేదాంట్లో సీట్ వస్తుంది. లేదంటే అంతే సంగతులు. అందుకే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

    మరి జనరల్ నాలెడ్జ్ కోసం కొన్ని ప్రశ్నలను చూసే తరుణంలో ముందుగా ఇప్పుడు ఓ ప్రశ్న గురించి తెలుసుకుందాం. విమానంలో ఓ కాయను అనుమతించరట. అదేంటంటే టెంకాయ అదేనండి కొబ్బరికాయ. మండే గుణం ఉంటుందని దీన్ని విమానాల్లోకి అనుమతించరట. అదేవిధంగా, మరొక ప్రశ్న ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఎండినప్పుడు 2 కిలోలు, తడిగా ఉన్నప్పుడు 1 కిలోలు, కాల్చినప్పుడు 3 కిలోలు ఉంటుంది. ఇంతకీ అదేంటి?

    ఈ ప్రశ్న కాస్త కష్టంగానే ఉంది కదా. సాధారణంగా ఏదైనా పదార్థం తడిగా ఉన్నప్పుడు కొంచెం బరువు ఉంటుంది. పొడిగా ఉన్నప్పుడు జిగురుగా అవుతుంది. కానీ ఈ ప్రశ్నలో తడిగా ఉన్నప్పుడు బరువు జిగురుగా, ఎండిన తర్వాత భారీగా ఉంటుందని అడిగాము కాబట్టి దీనికి ఆన్సర్ సల్ఫర్. అయితే సల్ఫర్ తడిగా ఉన్నప్పుడు 1 కిలో, ఎండినప్పుడు 2 కిలోలు. కాలిస్తే 3 కిలోలకు అవుతుందట. చూశారా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా జీకేతో కూడా కలుసుకుందాం.