Team India Coach : టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఈ టి20 వరల్డ్ కప్ తో ముగుస్తుంది. దీంతో అతడి స్థానంలో కొత్త కోచ్ ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే గడిచిన మే నెలలో దరఖాస్తులు ఆహ్వానించింది. తమ ప్రకటనకు పలువురు క్రీడాకారుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని బీసీసీఐ చెప్పింది. కానీ అందులో చాలావరకు ఫేక్ దరఖాస్తులు ఉన్నాయని తెలిసింది.. ఈ క్రమంలో టీమిండియా కోచ్ పదవికి ఒక్కరే దరఖాస్తు చేశారని జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.. భారీగా జీతం ఇస్తున్నప్పటికీ, అంతకుమించి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పటికీ మాజీ ఆటగాళ్లు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి బీసీసీఐ ఇతర బోర్డుల కంటే జీతభత్యాలను ఎక్కువగా ఇస్తుంది. ఇతర ప్రయోజనాలు కూడా భారీగానే కల్పిస్తుంది. అయినప్పటికీ మాజీ ఆటగాళ్లు ముందుకు రాకపోవడం కలవరాన్ని కలిగిస్తోంది. తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక, తక్కువ పనితో ఎక్కువ ఆదాయం వచ్చే ఫ్రాంచైజీ క్రికెట్ టీం లు ఉండటంతో చాలామంది కోచ్ పదవి కోసం దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది.
రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ ను ఎంపిక చేసినందుకు అప్పట్లో బీసీసీఐ దరఖాస్తుల కోరింది. ద్రావిడ్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వంటి వారి పేర్లు తొలుత వినిపించాయి. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ పేరు కూడా చక్కర్లు కొట్టింది. అయితే వీరు ఎవరు కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ జనరల్ సెక్రెటరీ జై షా ఇండియన్ క్రికెట్ పై పూర్తి అవగాహన ఉన్న వారిని మాత్రమే కోచ్ గా ఎంపిక చేస్తామని ప్రకటించారు. దీంతో వారి నియామకానికి దాదాపుగా బ్రేకులు పడ్డాయి..కొత్త కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు టీం ఇండియాతో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.
టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ మాత్రమే దరఖాస్తు చేశాడని తెలుస్తోంది. అయితే అతడి ఎంపిక దాదాపు లాంచనమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేస్తోంది. జూమ్ కాల్ ద్వారా గంభీర్ తో కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్ మాట్లాడారు.. గౌతమ్ గంభీర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించినట్టు తెలుస్తోంది.. మరోవైపు ఈ అడ్వైజర్ కమిటీ హెడ్ కోచ్ తో పాటు సెలక్టర్ ను కూడా నేను చెప్పనులో ఉంది. సలీల్ అంకోలా పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో మరో సెలెక్టర్ ను నియమించాల్సి ఉంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ అంకోలా వెస్ట్ జోన్ ప్రాంతానికి చెందినవారు. కాబట్టి కొత్తగా ఎంపిక చేసే సెలెక్టర్ నార్త్ జోన్ ప్రాంతానికి చెందిన వారై ఉంటారని తెలుస్తోంది.