Pakistan: తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా కూరగాయల ధరలు మండిపోతన్నాయి. టమాటా కిలో రూ.100 పలకగా, మిగతా కూరగాయలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ ధరలకే పేద, మధ్య తరగతి జనం ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని ఆందోళన చెందుతున్నారు. ఇక మన దేశం కొట్టిన దెబ్బకు ఆర్థికంగా కుదేలై అడుక్కుతిని బతుకుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో అయిదే ధరలు సామాన్యుడికే కాధు సంపన్నుకూ కూడా షాక్ ఇస్తున్నాయి. అక్కడ టమాటా కిలో రూ.200 పలుకుతోంది. చికెన్ అయితే కిలో రూ.700 దాటింది. దీంతో ధనికులతోపాటు సామాన్యులు, పేదలు అల్లాడుతున్నారు.
పండుగ రోజు పచ్చడి మెతుకులే..
తాజాగా ఈద్ అల్–అదా పండుగ నేపథ్యంలో అక్కడ నిత్యావసర వస్తుల ధరలు మరింత పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు అకాశాన్ని అంటడంతో ఇదే అదనుగా వ్యాపారులు ధరలను మరింత పెంచేశారు. ఇక లాహోర్‌లో అయితే వ్యాపారులు పండ్లు, కూరగాయలు, టమాటాల ధరలను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
144 సెక్షన్ విధంపు..
పాకిస్థాన్‌లో ధరల నియంత్రణకు అక్కడి ప్రభుత్వం టమాటా రవాణాపై నిషేధం విధించింది. దీంతోపాటు 144 సెక్షన్ విధుస్తున్నట్లు పెషావర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు లెక్క చేయడం లేదు.
ప్రభుత్వ ధరలకు రెట్టింపు..
ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలను ప్రకటించింది. వ్యాపారులు మాత్రం వాటికి రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, నిమ్మకాయల ధరలు రెట్టింపయ్యాయి. అల్లం, వెల్లుల్లి ధరలు 40 నుంచి 50 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిమ్మ కిలో రూ.480 చొప్పున అమ్ముతున్నారు. చికెన్ కిలో అధికారికంగా రూ.494 ఉంటే.. వ్యాపారులు మాత్రం రూ.520 నుంచి రూ.700లకు విక్రయిస్తున్నారు. బంగాళాదుంపలు కిలో రూ.75 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఎ– గ్రేడ్ ఉల్లి ధరలను కిలో రూ.100 నుంచి 105గా నిర్ణయిస్తే.. మార్కెట్లో కిలో రూ.150గా ఉంది.