Relationship: విడిపోతే ఆ రిలేషన్ లో ఎక్కువగా ఎవరు బాధపడాలి?

రిలేషన్ వద్దు అనుకునేవారు హ్యాపీగానే ఉంటారు. కానీ రిలేషన్ కావాలి అనుకునేవారు మాత్రం ఒక్కసారిగా కుంగుబాటుకు లోను అవుతారు. కొన్ని సార్లు మానసికంగా బాధపడే అవకాశం ఉంది.

Written By: Swathi Chilukuri, Updated On : April 18, 2024 12:13 pm

Relationship

Follow us on

Relationship: స్నేహంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ఆ బంధం అంత బలంగా ఉంటుంది. విమర్శలు, చెడుతనం, కోపం, అహం వంటి లక్షణాలు లేని స్నేహం ఎల్లప్పుడు మంచి ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా మోసం అనే పదం లేకపోతే ఎలాంటి రిలేషన్ అయినా బాగుంటుంది. కానీ స్వార్థ పూరిత స్నేహాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్ లో ఎలాంటి ఫలితాలు ఉండాలి అనేది పూర్తిగా మీ మనసుపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ, ఎఫెక్షన్ పెంచుకున్న ప్రతి వ్యక్తిలో ఒక్కసారి ఆ బంధం దూరం అయితే తట్టుకోవడం కూడా చాలా కష్టమే.

ఒక బంధం బాగుండాలంటే ఇద్దరు వ్యక్తులు కూడా మంచి రిలేషన్ ను మెయింటెన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి సమస్య రాదు. చిన్న చిన్న తప్పులను క్షమిస్తూ, పెద్ద మనసు చేసుకుంటే చేస్తున్న తప్పులను సరిదిద్దుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఏ బంధం అయినా బాగుంటుంది. గొడవలు లేని రిలేషన్ ఉండదు. కానీ క్షమాగుణం, సరిచేసుకోవడం మాత్రం ముఖ్యం. అయితే కొన్ని సార్లు రిలేషన్ ను దూరం చేసుకోవాల్సి వస్తుంటుంది. అందులో ఒకరు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు.

రిలేషన్ వద్దు అనుకునేవారు హ్యాపీగానే ఉంటారు. కానీ రిలేషన్ కావాలి అనుకునేవారు మాత్రం ఒక్కసారిగా కుంగుబాటుకు లోను అవుతారు. కొన్ని సార్లు మానసికంగా బాధపడే అవకాశం ఉంది. ప్రేమ వంటి రిలేషన్ లో అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదు. ఎవరైతే రిలేషన్ కావాలి అనుకుంటారో వారు మాత్రమే బాధ పడాల్సి వస్తుంటుంది. రిలేషన్ వద్దు అనుకునేవారు సులభంగా వీరి లైఫ్ లో నుంచి వెళ్లిపోతారు.

ఒక రబ్బరును రెండు వేళ్లతో పట్టుకొని లాగి ఒక వేలి నుంచి వదిలేస్తే మిగిలిన వేలుకు ఎంత దెబ్బ తాకుతుందో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. వదిలేసిన వేలు బాగుంటుంది. కానీ పట్టుకున్న వేలు మాత్రం నొప్పిని మోస్తుంటుంది. అంతేకాదు ఎంత ఎక్కువ లాగి వదిలితే అంత దెబ్బ తాకుతుంది. మీ రిలేషన్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బాధ కలుగుతుంది. కానీ కొన్ని సార్లు ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందే. ఒకసారి స్నేహం చేసేముందు ఇలాంటి పరిస్థితి వస్తే భరించాల్సి ఉంటుంది కాబట్టి ముందు నుంచి ఈ రిలేషన్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.