Aurangzeb: ఔరంగజేబు.. ఈ పేరు ప్రస్తావనకు వస్తే కొంతమంది మండిపడుతుంటారు. మరి కొంతమంది సమర్థిస్తుంటారు. ఓ వర్గం మెప్పుకోసం యుద్ధాలు చేశాడని, వారికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లను ధ్వంసం చేశాడని ఔరంగజేబుపై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తన మతానికి చెందిన వారికి అగ్ర తాంబూలం ఇచ్చి.. మిగతావారి పట్ల కర్కశంగా వ్యవహరించాడని ఔరంగజేబు పై విమర్శలు ఉన్నాయి. చారిత్రక ఆనవాళ్ళ ప్రకారం ఔరంగజేబు పరిపాలన కాలం లో విధ్వంసం అనేది తారస్థాయికి చేరిందని తెలుస్తోంది. ఔరంగజేబు పరిపాలన విషయంలో గొప్ప గొప్ప మార్పులు చేపట్టకపోయినప్పటికీ.. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటంతో కిందిస్థాయి వారు పరిపాలన విషయంలో చక్రం తిప్పేవారట. కుటుంబ సభ్యుల పెత్తనం కూడా అధికంగా ఉండేదట. బహుభార్యత్వం అనేది అప్పట్లో పెద్ద నేరం కాదట. అందుకే ఔరంగజేబు లెక్కకు మిక్కిలిగా వివాహాలు చేసుకున్నాడట.
ఔరంగజేబు 1618లో దాహద్(ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో) షాజహాన్, ముంతాజ్ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. మొగల్ సామ్రాజ్యాన్ని ఏలేందుకు తన సోదరులతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అందర్నీ ఓడించాడు. అత్యంత క్రూరమైన రాజుగా ఔరంగజేబు వినతికెక్కాడు. 1707లో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో కన్నుమూశాడు. అతడి మృతదేహాన్ని ఖుల్తాబాద్ తరలించారు. ఔరంగాబాద్ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్తా బాద్ ప్రాంతంలో ఔరంగజేబు సమాధి ఉంది.
ఔరంగజేబు పరిపాలన కాలంలో హిందువులపై అకృత్యాలు తీవ్రంగా జరిగేవి. అత్యాచారాలు, హత్యలు నిత్య కృత్యంగా ఉండేవి. అప్పట్లో సైనికులు హిందువుల ఇళ్ళ మీద పడి దాడులు చేసేవారు. వారి ఇళ్లకు నిప్పులు పెట్టేవారు. శిస్తు పేరిట హిందువులు పండించిన పంటలను దౌర్జన్యంగా లాక్కునేవారు. ఔరంగజేబు కు మొత్తం ముగ్గురు భార్యలు. వీరు మాత్రమే కాకుండా అంతఃపుర కన్యలు వేరే ఉండే వారట. ఔరంగజేబు 1637లో దిల్రాస్ బేగాన్ని మొదట వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తన రాజకీయ సౌలభ్యం కోసం నవాబ్ బాయి అనే హిందూ యువరాణిని పశపరచుకొని 1638లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ ఉండగానే జార్జియా అనే యువతితో ఔరంగజేబు వివాహేతర సంబంధం నడిపాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు.