Vastu Tips: ఇల్లు ఎంత పెద్దగా కట్టుకున్నా ఆ ఇంటిని వాస్తు పరంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్కసారి ఇల్లు ఆ ఇంటి వాస్తుకు సమస్య లేకపోతే ఆ ఇంట్లో మహాలక్ష్మీ తిష్టవేస్తుంది. ఇక ఇల్లు మాత్రమే కాదు ఇంట్లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఉండాలని అనుకుంటారు కొందరు. వాస్తు నిపుణులు కూడా అదే విధంగా చెప్తారు కాబట్టి వాస్తు అనేది చాలా మంది నమ్మే ఒక నమ్మకం. అయితే వస్తువుల విషయంలో మాత్రమే కాదు ఇంటి ప్రహారి గోడ విషయంలో కూడా అదే విధంగా వాస్తును నమ్మాలి అంటున్నారు నిపుణులు.
ఇల్లు ఎంత పెద్దగా ఉన్న కంపౌండ్ వాల్ మాత్రం ఉండాల్సిందే. లేదంటే ఆ ఇంటికి అందమే ఉండదు. ఈ ప్రహారి గోడలను రకరకాల డిజైన్ లతో నిర్మిస్తారు. ఇక ఈ కంపౌండ్ వాల్ కు గేటు కూడా ఉంటుంది. మరి కంపౌండ్ వాల్ కంటే గేటును ఎత్తుగా పెట్టవచ్చా? లేదా? దీని విషయంలో పండితులు ఏమంటున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం.
మీరు నిర్మించుకునే గేటుకు పైకప్పు లేకపోతే ఆ ఇంటి విషయంలో, గేటు విషయంలో ఎలాంటి సమస్య ఉండదట. ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. అయితే గేటుకు ఇరవైపున దిమ్మెలు ఉండటం కూడా డిజైన్ లో భాగమే అని దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇక ప్రహారి గోడ కంటే గేటు ఎత్తులో ఉన్నా గోపురం లాంటి ఆకారం ఉన్న ఈ విషయంలో కూడా సమస్య లేదు అంటున్నారు. ఉత్తర-ఈశాన్యం, తూర్పు ఈశాన్యం- దక్షిణ-ఆగ్నేయం, పడమర-ఆగ్నేయం దిక్కున గేట్లను ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తాయి అంటున్నారు నిపుణులు.
ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం, దక్షఇణ నైరుతి, పడమర నైరుతి ఉన్న గేట్లు చెడు ఫలితాలను అందించే ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ వైపున గేట్లను ఉంచకపోవడమే ఉత్తమం. ఇక గేట్ల విషయంలో రేఖాసంఖ్యను పాటించాలి. వీటికి వేసే రంగుల విషయంలో కూడా వాస్తును చూడాలంటారు. అంతేకాదు ఎక్కువగా నల్ల రంగు ఉన్న గేట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.