https://oktelugu.com/

Relationship: మీరు ఎవరిని ఇష్టపడుతున్నారు? ఎందుకు?

లైంగిక ధోరణి అనేది ఒకరి గుర్తింపుకు తగిన సంక్లిష్టమైన, వ్యక్తిగత అంశంగా పరిగణిస్తారు. అయితే చాలా మంది ఎవరి పట్ల ఆకర్షితులయ్యాము?” అనే ప్రశ్న వేసుకుంటే.. దానికి సరిపోయే సమాధానం దొరకకపోవచ్చు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 9, 2024 / 03:00 AM IST

    Relationship

    Follow us on

    Relationship: ప్రస్తుతం సమాజంలో ఎవరి పట్ల ఎవరు ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలను, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడడం సర్వసాధారణం. కానీ ఈ కాలంలో ఎక్కువగా అమ్మాయిలను అమ్మాయిలు, అబ్బాయిలను అబ్బాయిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి సమస్యలు హైకోర్టు, సుప్రింకోర్టుల వరకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల శరీరం అబ్బాయిగా ఉండి.. పనులు అమ్మాయిగా ఉంటే.. వారి కోరికలు, ఆలోచనలు వేరే ఉంటాయి. అప్పుడు ఒకే జండర్ తో ఉండే వ్యక్తులను ఇష్టపడతారు.ఇలాంటి వ్యక్తులను చూస్తే.. కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అయితే మీరు ఎవరి పట్ల ఆకర్షితులవుతున్నారు? ఎవరి పట్ల ఆకర్షితులు అవడం లేదు? అసలు వ్యతిరేక లింగంపై మీకు ఆసక్తి లేదని సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

    మీరు వీటిని గుర్తించగలరా?
    లైంగిక ధోరణి అనేది ఒకరి గుర్తింపుకు తగిన సంక్లిష్టమైన, వ్యక్తిగత అంశంగా పరిగణిస్తారు. అయితే చాలా మంది ఎవరి పట్ల ఆకర్షితులయ్యాము?” అనే ప్రశ్న వేసుకుంటే.. దానికి సరిపోయే సమాధానం దొరకకపోవచ్చు. కొన్ని సార్లు అమ్మాయిలతో ఎక్కువగా ఉండాలి అనిపిస్తుంటుంది. ఇక ప్రేమ విషయానికి వస్తే.. ఇతర జెండర్ తో ఉండాలి అనిపిస్తుంది. సరదాగా గడిపేసమయంలో స్నేహితులతో, చుట్టుపక్కన వారితో ఉంటాం. అలా వారితో ఎక్కువ సమయం గడుపుతుంటాం. అయితే ఎక్కువ మంది వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుండగా.. అదే లింగానికి చెందిన వ్యక్తుల పట్ల మరికొంత మంది ఆకర్షితులవుతున్నారు. అయితే మీ లైంగిక ధోరణి పట్ల మీకు గందరగోళంగా అనిపిస్తే.. వ్యతిరేక లింగంపై మీకు ఆసక్తి లేదని సూచించే కొన్ని ఖచ్చితమైన షాట్ సంకేతాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం…

    ఆకర్షణ లేకపోవడం..
    కొంత మంది వ్యతిరేక లింగంపై ఆసక్తి చూపించడం లేదని తెలిపే అత్యంత స్పష్టమైన సంకేతాలలో ఒకటి ఆకర్షణ లేకపోవడమేనట. తమ పట్ల లైంగికంగా/శృంగారపరంగా ఆకర్షితులవున్నారని అనిపించకపోతే కాస్త ఆలోచించాలట. ఇక వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తుల పట్ల కూడా ఆకర్షితులు కాకపోతే కూడా ఒకసారి ఆలోచించాలి. అసలు దీనికి కారణం ఇతర జెండర్ పై కోపమా, లేదా మోసం చేస్తారు అనే ఆత్మనూన్యతా భావమా, లేదా మరేమైన సమస్యనా అని ఆలోచించాలి.

    సరసాలాడుటలో అసౌకర్యం..
    కొంతమందిలో వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులతో సరసాలాడటం కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే.. మీరు వారిపై శృంగారపరంగా లేదా లైంగికంగా ఎలాంటి ఆసక్తిని చూపడం లేదని చెప్పాలి. అయితే ఇది కేవలం ఒక వ్యక్తి పరంగా ఆలోచిస్తున్నారా? లేదా పూర్తిగా ఆ వర్గం వల్లనే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారా? అనే విషయాల గురించి కూడా పూర్తిగా ఆలోచించాలి. అయితే ఇతరులతో రోమాన్స్ చేయాలి అనిపిస్తే.. వారి పట్ల మీరు ఆకర్షితులయ్యారని.. లేదా వారంటే మీకు ఇష్టమని, ప్రేమని గుర్తించండి. కానీ ఆ ఫీల్ కూడా ప్రేమతోనా? లేకపోతే కొంత వరకు మాత్రమేనా అని కూడా తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు జవాబు మీ దగ్గర కచ్చితంగా ఉంటుంది. అందుకే మీకు మీరే మంచి గైడ్ అని తెలుసుకోండి.

    కోరిక లేకపోవడం
    వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల మీకు శారీరక కోరిక లేనప్పుడు, మీరు ఖచ్చితంగా వారిని ఇష్టపడరు. ఎవరితోనైనా ఆకర్షితులైనప్పుడు, లైంగిక ఉండడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యంగా ముద్దులు, కౌగిలింతలు చేసుకోవడం చేస్తుంటారు. మరికొంత మంది చేతిని వీపు లేదా నడుముపై అసాధారణంగా తాకడంతో వారి కోరికను తెలియజేస్తుంటారు. ఇలాంటిప్పుడు కూడా ఆలోచించడం మంచిది.

    ఒకే లింగానికి చెందిన వ్యక్తుల పట్ల ఆకర్షణ..
    ఒకే జండర్ కి సంబంధించిన వ్యక్తులతో స్నేహాన్ని ఏర్పరచుకోవాలనే కోరిక ఉంటే..ఒకే లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారని సంకేతం. ఈ ఆకర్ణణ ఏ విధమైన ఆకర్షణ అని కూడా తెలుసుకోవాలి. వారితో శృంగార సంబంధాన్ని కొనసాగించాలని అనిపిస్తూ ఉంటే.. అలాంటి వారిని స్వలింగ సంపర్కులని అనుకోవచ్చు..

    లింగ పాత్రలపై ఆసక్తి లేకపోవడం
    సేమ్ జెండర్ తో ఉన్నప్పుడు అసౌకర్యంగా ఫీలైతే కూడా ఆలోచించాలి. మీరు వ్యతిరేక లింగంపై ఆసక్తి చూపుతున్నారని సంకేతం. ఇలా జెండర్ ను బట్టి ఫీలింగ్స్ వస్తే.. కచ్చితంగా మీరు ఈ విషయం పట్ల ఆలోచించాల్సిందే. దీనితో మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? అసలు మీకు కావాల్సింది ఏమిటి? లేదా ఎలాంటి అంశాల పట్ల ఆకర్షితులవుతున్నారు? దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి?వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. లేదా భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది.

    కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. పుట్టుకతో వచ్చినా కొన్ని సమస్యల వలన ఎలాంటి మార్పులు చేయలేం అని గుర్తు పెట్టుకోండి. ఇలాంటి విషయాలను ఎక్కువగా ఆలోచించి మానసికంగా కుంగిపోయి మరిన్ని సమస్యలను తెచ్చుకుంటారని గుర్తుపెట్టుకోండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..