https://oktelugu.com/

Chanakya Neeti : వ్యాపారంలో రాణించాలని ఉందా? చాణక్య నీతి ప్రకారం ఈ 5 సూత్రాలు పాటిస్తే విజయం మీదే..

చాణక్య నీతి ప్రకారం వ్యాపారులు కొన్ని సూత్రాలు పాటించడం వల్ల కచ్చితంగా రాణిస్తారని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొందరు ఇవి పాటించి మంచి పొజిషన్లో ఉన్నారని అంటున్నారు. ఇంతకీ వ్యాపారుల కోసం చాణక్యుడు ఎటువంటి సూత్రాలు చెప్పాడో చూద్దాం..

Written By:
  • Srinivas
  • , Updated On : October 8, 2024 6:19 pm
    Chanakya Neeti

    Chanakya Neeti

    Follow us on

    Chanakya Neeti : వ్యాపారం చేయాలని చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక.. స్వేచ్ఛగా డబ్బు సంపాదించాని అనుకునేవారు వ్యాపారులుగా రాణించాలని అనుకుంటారు. వ్యాపారం చేయడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని కోసం కష్టపడడం ద్వారా అందులో ఉండే మజానే వేరు అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే వ్యాపారంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కోవాలి. కష్టనష్టాలను తెలిసి ఉండాలి. ఒక్కోసారి కోలుకోలేని నష్టం కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే వ్యాపారంలో రాణిస్తారు. అయితే చాణక్య నీతి ప్రకారం వ్యాపారులు కొన్ని సూత్రాలు పాటించడం వల్ల కచ్చితంగా రాణిస్తారని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొందరు ఇవి పాటించి మంచి పొజిషన్లో ఉన్నారని అంటున్నారు. ఇంతకీ వ్యాపారుల కోసం చాణక్యుడు ఎటువంటి సూత్రాలు చెప్పాడో చూద్దాం..

    పటిష్టమైన నాయకత్వం:
    ఒక వ్యాపారుడు తాను చేసే వ్యాపారంపై పట్టు సాధించాలి. అలాగే ప్రతీ విషయాన్ని బాధ్యతగా ఉండాలి. ఒక్కోసార ఎదురుదెబ్బలు తగలవచ్చు. ఇలాంటి సమయంలో ఏమాత్రం భయపడకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. కొందరు తన కింద పనిచేసే ఉద్యోగులపై లీడర్ లా వ్యవహరించాలి. ఉద్యోగులతో పనిచేయిస్తూనే వారికి కావాల్సిన సౌకర్యాలు అందించాలి. అప్పుడే వారి నుంచి ఇన్ పుట్ పొందగలరు. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

    మార్కెటింగ్ వ్యూహం:
    ఒక వస్తువు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో.. దానిని మార్కెట్లోకి తీసుకెళ్లడం అంతే శ్రమతోక కూడిన పని. అయితే ఆ వస్తువు వినియోగదారుల వద్దకు తీసుకెళ్లి దానిని కొనగలిగే విధంగా వ్యూహం రచించాలి. అప్పుడే ఆ వస్తువుకు గుర్తింపు వచ్చి సేల్స్ అవుతూ ఉంటాయి. అయితే ముందు చూపు ప్రణాళికతో వ్యూహం రచించడం వల్లే ఈ వస్తువును అమ్మడంలో విజయం సాధిస్తారు. అందుకోసం అడ్వర్టయిజ్మెంట్, ఇతర ప్రసార సాధనాలను వాడుకొని ఏదీ మంచిదో నిర్ణయించుకునే శక్తి ఉండాలి.

    కన్సల్టెంట్ల నియామకం:
    వ్యాపారులు నేరుగా వినియోగదారులతో సంబంధాలు ఉండే అవకాశం లేదు. ఒక్కోసారి కన్సల్టెంట్ల అవసరం ఉంటుంది. ఈ విషయంలో వారు వ్యాపారులకు సరైన విధంగా సహకరిస్తే ఆ వ్యాపారస్తుడు అనుకున్న విజయం సాధిస్తాడు. ఈ విషయంలో కొందరు మంచి స్నేహితులు ఉండడం వల్ల కూడా వారి ద్వారా వస్తువులు ప్రజల్లోకి వెళ్తాయి.

    ఆర్థిక వ్యవహారాలు:
    వ్యాపారులు చేసే ముఖ్య విధి ఆర్థిక ప్రణాళిక పక్కాగా ఉండడం. ఏ సమయంలో ఏ అవసరానికి ఏ విధంగా డబ్బు ఖర్చు పెట్టాలో తెలిసి ఉండాలి. ఒక్కోసారి కొన్ని ఖర్చులు అదనంగా వస్తుంటాయి. అలాగే నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆర్థిక ప్రణాళికలు వేయడం ఎంతో ముఖ్యం.

    నిపుణులైన సిబ్బంది:
    వ్యాపారంలో రాణించాలంటే తానొక్కడే టాలెంట్ అయిన వ్యక్తి ఉంటే సరిపోదు. తనతో పాటు నిపుణులైన ఉద్యోగులు సంస్థలో ఉండాలి. అప్పుడే కలసికట్టుగా విజయం సాధిస్తారు. అయితే నిపుణులను ఎంచుకునే విషయంలో కాస్త తెలివిగా ప్రదర్శించారు. వారు పనిచేయగలిగేవారేనా? అనేది చూసుకోవాలి.