Ustaad Bhagat Singh Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. విజువల్ వండర్స్ తో మన దర్శకులందరు ప్రేక్షకులను మెప్పిస్తున్న క్రమంలో కమర్షియల్ సినిమాలకు మాత్రం ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే కమర్షియల్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించగలిగే కెపాసిటి ఉన్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
కథ
అమ్మనాన్న లేని చిన్నయ్య (పవన్ కళ్యాణ్) అనే కుర్రాడు ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడి (కే ఎస్ రవికుమార్) ని కొంతమంది దొంగల నుంచి కాపాడుతాడు. అలా కాపాడిన చిన్నయ్య ను ఆ ఉపాధ్యాయుడు బడిలో చేర్పించి పాఠాలు చెప్పిస్తాడు… అలాగే చిన్నయ్య ఆవేశం ఆయన ఆలోచన చూసిన ఉపాధ్యాయుడు అతనికి ‘భగత్ సింగ్’ అనే పేరు పెడతాడు…దాంతో చిన్నయ్య పేరు భగత్ సింగ్ అవుతుంది. అలాగే చిన్నయ్య వాళ్ల బతికి ఉన్నప్పుడు ఉస్తాద్ అంటే ఉంటే ఉండటం తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా తన పేరు మార్చుకుంటాడు…
పేద పిల్లలకు పాఠాలు బాగా చెబుతున్నందుకు ఆయనకి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వస్తుంది. స్వయంగా సీఎం తనను కలవడానికి వస్తాడు…దాంతో సీఎం ఆ ఉపాధ్యాయుడిని నువ్వు రాజకీయాల్లోకి రావచ్చు కదా ఇంకా అందరికీ హెల్ప్ చేయవచ్చు అని చెప్పడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడు…అలా ఆ ఉపాధ్యాయుడు సీఎం అవుతాడు…ఇక సీఎం అవ్వాలనే అధికార కాంక్ష తో ఉన్న నల్ల నాగప్ప(పార్తీబన్)కి సీఎం ను చంపేసి ఆ కుర్చీలో తను కూర్చోవాలని చూస్తాడు. నల్ల నాగప్ప నుంచి సీఎం ను భగత్ సింగ్ ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో తీసుకెళ్లాడు. పవన్ కళ్యాణ్ మేనియా ను వాడుతూ అక్కడక్కడ కామెడీ పంచులు పేలుస్తూ సినిమాని ఎంగేజింగ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ లో రాశి కన్నా పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి. అవి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ సెకండాఫ్ లో శ్రీలీలా ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి సినిమా ఒక ఊపు అందుకుంటుంది. పవన్ కళ్యాణ్ శ్రీలీల మధ్య వచ్చిన ఎపిసోడ్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి సీను కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది… సెకండ్ లో వచ్చే ప్రతి ఎమోషనల్ సన్నివేశం గాని లవ్ సీన్ కానీ అన్ని చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి…
హరీష్ శంకర్ ఈ సినిమా కోసం కొత్త కథనైతే ఎంచుకోలేదు. రొటీన్ కథతో సినిమాను చేసిన కూడా సినిమాలో ఏం జరగబోతుందనేది మనకు ముందుగానే అర్థం అవుతుంది. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ప్రేక్షకులు అదంతా మర్చిపోయి పవన్ కళ్యాణ్ మేనియాని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంత పెద్దగా వర్కౌట్ కాకపోయిన కూడా సెకండాఫ్ మాత్రం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి… ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన పూర్తి కమర్షియల్ సినిమా కూడా ఇదే కావడం విశేషం…
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించింది చాలా తక్కువ సమయం కానీ ఈ సినిమాలో చాలా ఎక్కువ సేపు కనిపించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే హరీష్ శంకర్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఇందులో రెండు గంటల పాటు కనిపిస్తూనే ఉంటాడు. ప్రతి సన్నివేశంలో తను ఆకట్టుకునే విధంగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ ఆరా ను వాడుకొని మరోసారి ఒక వండర్ ని క్రియేట్ చేయడానికి హరీష్ శంకర్ చేసిన ప్రయత్నం అయితే చాలావరకు వర్కౌట్ అయింది…
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్క్ అవుట్ అయింది… సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా set అయింది. ఒక రకంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాలకు ఊపిరి పోసిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలోని ఒక సాంగ్ అయితే ఈ సినిమాలో వాడారు. అది బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఎపిసోడ్ సైతం ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వచ్చిన ఒక ట్విస్ట్ కూడా చాలా హైలెట్ గా నిలిచింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
పవన్ కళ్యాణ్ ఇంతకుముందు లాగే చాలా బాగా నటించాడు. అతనికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాని సక్సెస్ఫుల్గా నిలపడానికి దర్శకుడు ఏది చెబితే అది చేసేసాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఇతర హీరోల సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం లాంటివి సైతం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి. ఇక సెకండాఫ్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిలో జోష్ తీసుకువచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమ్లన్నింటి కంటే చాలా అందంగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.
ఆయన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. కనిపించింది తక్కువ సమయమే అయిన కూడా ఆమె తన పాత్రతో ప్రేక్షకులకు న్యాయం చేసింది… రాశిఖన్నా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉన్నప్పటికి ఆమె ఓకే అనిపించింది. ఇక విలన్ గా చేసిన పార్తీ బన్ సైతం అనవసరంగా అరవడాలు, డైలాగులు చెప్పడాలు లేకుండా చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడంలో ఆయన సక్సెస్ అయ్యాడు… కే ఎస్ రవి కుమార్ ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయన యాక్టింగ్ కూడా బాగా ప్లస్ అయింది…ఇక మిగిలిన నటి నటులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది…సాంగ్స్ అన్నింటికి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు… తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకి ప్లస్ అయింది…ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం సెట్స్ చాలా బాగా వేశాడు…ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది…ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…
ఈ మూవీలో బాగున్నవి
పవన్ కళ్యాణ్
సెకండాఫ్
శ్రీ లీల యాక్టింగ్
ఈ మూవీలో బాగోలేనివి
ఫస్టాఫ్
రొటీన్ కథ
కామెడీ సీన్స్
రేటింగ్ : 2.5/5

