https://oktelugu.com/

Pregnant women do workouts: గర్భిణులు వర్క్‌వుట్‌లు చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది?

గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఆహారం నుంచి చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహిస్తారు. తల్లి కావడం అనేది గొప్ప వరం. ఇలాంటి సమయంలో మహిళలు జాగ్రత్త వహించక తప్పదు. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వాంతులు, సరిగ్గా ఫుడ్ తినాలనిపించకపోవడం, మలబద్దకం, వెన్నునొప్పి వంటి సమస్యలన్ని కనిపిస్తాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 9, 2024 / 02:00 AM IST

    Pregnant-women-do-workouts

    Follow us on

    Pregnant women do workouts: గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఆహారం నుంచి చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహిస్తారు. తల్లి కావడం అనేది గొప్ప వరం. ఇలాంటి సమయంలో మహిళలు జాగ్రత్త వహించక తప్పదు. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వాంతులు, సరిగ్గా ఫుడ్ తినాలనిపించకపోవడం, మలబద్దకం, వెన్నునొప్పి వంటి సమస్యలన్ని కనిపిస్తాయి. ఈ సమయంలో మహిళలు పోషకాలు ఉండే ఆహారాలు మాత్రమే తినాలి. ఎందుకంటే ఆ ఫుడ్ బట్టి పిల్లలు ఆరోగ్యంగా పుడతారని వైద్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా గర్భిణులు మానసిక, శారీరక సమస్యలతో కాస్త ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్యలన్నీ ఎవరికైనా సాధారణమే. గర్భంతో ఉన్నప్పుడు ఎవరు ఏ ఆరోగ్య జాగ్రత్తలు చెప్పిన పాటిస్తుంటారు. గర్భిణులు డైలీ వ్యాయామం చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని, ఆరోగ్యానికి మంచిదని కొందరు చేస్తుంటారు. అయితే వ్యాయామం మంచిదే.. కానీ గర్భిణులు చేయవచ్చా? లేదా? అని క్లారిటీగా తెలుసుకోకుండా కొందరు చేస్తుంటారు. తక్కువగా వ్యాయామం కాకుండా కొందరైతే ఎక్కువగా వర్క్‌వుట్‌లు చేస్తుంటారు. మరి ఇలా ఎక్కువగా వర్క్‌వుట్‌లు గర్భిణులు చేయడం మంచిదేనా? లేదా? వివరంగా తెలుసుకుందాం.

    గర్భధారణ సమయంలో మహిళలు వ్యాయామం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నవారు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్, యోగా, పైలేట్స్, రన్నింగ్ వంటివి నెమ్మదిగా చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు వ్యాయామం చేయడం వల్ల గర్భాశయం, మూత్రాశయానికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి చేయలేకపోతే తక్కువ నిమిషాలు పాటు చేసుకుంటూ పోవాలని నిపుణులు అంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చురుకుగానే ఉండాలి. రోజులో ఎంతో కొంత సమయం శారీరక శ్రమ ఉండాలి. ఎక్కువగా కూర్చొకుండా శారీరకంగా కొంత శ్రమ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని రకాల వర్క్‌వుట్‌లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా హాట్ యోగా, డౌన్‌హిల్ స్కీయింగ్, హాకీ, బాస్కెట్‌బాల్, సాకర్, రెజ్లింగ్, స్కూబా డైవింగ్, జిమ్నాస్టిక్స్, వాటర్ స్కీయింగ్, గుర్రపు స్వారీ వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని చేయడం వల్ల కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    గర్భం దాల్చిన వారు ప్రతి విషయంలో జాగ్రత్త పాటించడం చాలా ముఖ్యం. ప్రతి విషయంలో డాక్టర్ సూచనలు తీసుకోవాలి. ప్రతి నెల డాక్టర్ చెకప్‌కి వెళ్తుండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫాస్ట్‌ఫుడ్ వంటివి అసలు తినకూడదు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, జ్యూస్‌లు వంటి వాటిని తీసుకోవాలి. అయితే పండ్లలో బొప్పాయి, పైనాపిల్ వంటి కొన్ని పదార్థాలను తినకూడదు. వీటిని తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గర్భిణులు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.