Colors: ఈ రంగుల్లో మీకు ఏ రంగు అంటే ఇష్టం.. అర్థం తెలుసా?

కలర్ సైకాలజీ ప్రకారం ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉంటుంది. వ్యక్తిత్వాన్ని తెలిపే లక్షణం, భావోద్వేగాల గురించి కూడా ఫేవరేట్ కలర్ తెలుపుతుందట. అయితే వివిధ రంగులు వాటి గురించి తెలుసుకుందామా?

Written By: Swathi Chilukuri, Updated On : September 12, 2024 6:18 pm

Colors

Follow us on

ఎరుపు: ఎరుపు రంగు చాలా స్ట్రాంగ్ కలర్ అంటారు నిపుణులు. ఇది మీ ఫేవరెట్ కలర్ అయితే మీరు బలమైన, నమ్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. చాలా పవర్ ఫుల్ కలర్ కూడా. ఈ రంగును ఇష్టపడేవారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఫుల్ గా ఉంటుంది. రెడ్ కలర్ దుస్తులు వేసుకుంటే కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందరిలోనూ చాలా ప్రత్యేకంగా, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.

గోధుమ రంగు: బ్రౌన్ కలర్ స్థిరత్వాన్ని తెలుపుతుంది. ఈ రంగును ఇష్టపడే వారు ఎక్కువ స్టెబిలిటీ గా ఉంటారు. ఆలోచనల్లో, చేసే పనుల్లో చాలా స్ట్రాంగ్. ఈ రంగును ఇష్టపడేవారు నమ్మకంగా, విశ్వాసం కలిగిన వ్యక్తులుగా పేరు సంపాదిస్తారు. వారికి ఇష్టమైన వారి కోసం ఎంతైనా రిస్క్ చేస్తారు.

గులాబీ రంగు(pink): ప్రేమకు చిహ్నం గులాబీ కలర్. ఈ రంగును ఇష్టపడే వారు ప్రేమ పూర్వకంగా ఉంటారు.. అందరితోనూ సంతోషంగా ఉంటారు. సౌమ్యంగా కనిపిస్తారు. ఆప్యాయంగా మాట్లాడుతుంటారు ఈ రంగును ఇష్టపడేవారు. సున్నిత మనస్కులు కూడా వీరు. వీరికి సానుభూతి ఎక్కువ ఉంటుందట.

ఊదా రంగు(purple): ఊదా రంగును ఇష్టపడే వారు రాయల్టీగా, లగ్జరీగా ఉండటానికి ఇష్టపడతారు. లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవతుంటారు. వీరు తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు.సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. వీరు ఇతరులకు ఆదర్శంగా కనిపిస్తుంటారు. ఇతరుల నుంచి కొత్త ఆలోచనలను తీసుకుంటారు. విలాసంగా జీవితాన్ని గడుపుతారు.

పసుపు(yellow): పసుపు రంగు ఆనందానికి సింబల్. ఈ రంగును ఇష్టపడే వారు ఆశావాద ఆలోచనలతో జీవిస్తుంటారు. వీరు ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని కలిగా ఉంటారని అంటున్నారు నిపుణులు. వీరికి సానుభూతి ఎక్కువ. మంచి కారెక్టర్ కలిగి ఉంటారట. పసుపు రంగును ఇష్టపడే వారికి సృజనాత్మకత ఎక్కువ. వీరు సమాజంలో చురుకుగా జీవిస్తారు. వీరు ఎక్కడుంటే అక్కడ సంతోషమే ఉంటుంది.

తెలుపు(white): తెలుపు రంగు ఎంత స్వచ్ఛతకు గుర్తు. ఈ రంగు ఇష్టపడే వారు ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. వీరు సంపూర్ణత్వాన్ని కోరుకుంటారు అలాగే ఉండాలి అనుకుంటారు. ఏ పనిచేసినా పూర్తి చేస్తారు. దీన్ని ఇష్టపడే వారు ఎక్కువగా సాధారణమైన జీవితాన్ని గడపాలి అనుకుంటారు. చిత్తశుద్ధితో పనులు చేస్తుంటారు కూడా. వారు పాటించే క్రమశిక్షణ అందరినీ ఆకర్షిస్తుంది. ఎదుటి వారి తప్పులను కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కోంటారు.

నీలం(blue): నీలం రంగు ప్రశాంతతను సూచిస్తుంది. ఇది శాంతికి సింబాలిక్. ఈ రంగును ఇష్టపడే వారు కూడా ప్రశాంతంగా ఉంటారు. సాధారణంగా కనిపిస్తూ.. నమ్మకమైన వ్యక్తులుగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు ఈ రంగును ఇష్టపడేవారు. వీరు చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటారు. సున్నిత మనస్కులు వీరు. భావోద్వేగాలను బాగా కంట్రోల్ చేసుకుంటారు.

నలుపు(black): నలుపు రంగు సాధారణంగా లగ్జరీ జీవితాన్ని సూచిస్తుంది. ఈ రంగును ఇష్టపడేవారు లగ్జరీ జీవితాన్ని కావాలి అనుకుంటారు. వీరికి తెలివి తేటలు ఎక్కువ . అయితే ఎప్పుడూ మూడీగా కనిపిస్తుంటారు. నలుపు రంగును ఇష్టపడే వారు తమ భావాలను బయటకు వ్యక్తీకపచడానికి ఇష్టపడరు అంటున్నారు నిపుణులు.. వీరి మాటలు, ఆలోచనలు అంత ఈజీగా ఇతరులకు అర్థం కావు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.