https://oktelugu.com/

Horoscope Today: ఈ మూడు రాశుల వారిని కొందరు తప్పుదోవ పట్టిస్తారు.. జాగ్రత్త..

ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయి. మనసులో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా ఉంటారు. ఉద్యోగులు స్థిరత్వాన్ని కోల్పోతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2024 / 08:00 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సోహో గ యోగం, రవియోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మొత్తం 12 రాశుల ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.కొందరు శత్రువులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి కష్టపడుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

    వృషభ రాశి:
    ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయి. మనసులో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా ఉంటారు. ఉద్యోగులు స్థిరత్వాన్ని కోల్పోతారు.

    మిథున రాశి:
    వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ప్రభుత్వ రంగ పనులకు సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరుగుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కర్కాటక రాశి:
    ఆర్థికంగా కొన్ని సమస్యలు బయటపడుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి. కొంత మంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి.

    సింహారాశి:
    ఉద్యోగులు ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విధుల కోసం తక్కువ సమయం కేటాయిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు.

    కన్య రాశి:
    ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటాయి. దీంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    వ్యాపారులకు కొత్త ఆదాయంవస్తుంది. అనుకోని అదృష్టం ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లపై శుభవార్తలు వింటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. అనుకోకుండా కొన్ని లాభాలు పొందుతారు.

    వృశ్చిక రాశి:
    ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో ఆదాయం వచ్చినా నష్టమే ఉంటుంది. కొన్ని పనుల కారణంగా ఒత్తిడి ఉంటుంది. సాయంత్రం కొంత మంది నుంచి బహుమతులు పొందుతారు. ఉద్యోగులు అనుకోని ప్రయోజనాలు పొందే అవకాశం.

    ధనస్సు రాశి:
    కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. మానసికంగా ఆందోళనతో ఉంటారు.

    మకర రాశి:
    ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కుంభరాశి:
    వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని పనుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

    మీనరాశి:
    ఉద్యోగులకు ఉల్లాసంగా ఉంటుంది. ప్రమోషన్లపై శుభవార్తలు వింటారు.వ్యాపారులకు ఖర్చలు పెరుగుతాయి. చాలావ వరకు పనులు వాయిదా వేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు.