Parenting Tips: ప్రతి తల్లి చేసే కామన్ తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

బిడ్డల విషయంలో తల్లి తప్పు చేయడం ఏంటి అనే అనుమానం వచ్చిందా? డైరెక్ట్ గా కాకపోయినా.. పొరపాటున కొన్ని మాటలు అన్నా సరే ప్రభావం చూపిస్తాయట. అవేంటి..? పిల్లల ముందు తల్లి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : September 12, 2024 6:26 pm

Parenting Tips

Follow us on

Parenting Tips: ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ మాత్రమే చాలా గొప్పది. అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ మరోటి లేదు. తల్లి, తమ పిల్లల కోసం ఏదైనా చేస్తుంది. తాను ఆకలితో ఉన్నా.. తమ బిడ్డలను మాత్రం పస్తులతో ఉంచదు. తాను నిద్రపోకున్నా.. తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని అని కోరుకునేది అమ్మ ఒక్కతే కదా. దాదాపు మన దేశంలో ప్రతి తల్లి.. బిడ్డల క్షేమం కోసం, వారి అవసరాలు తీర్చడానికే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ.. తెలిసీ తెలియక తల్లులు చేసే కొన్ని పనులు బిడ్డల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంతకీ అవేంటంటే..

బిడ్డల విషయంలో తల్లి తప్పు చేయడం ఏంటి అనే అనుమానం వచ్చిందా? డైరెక్ట్ గా కాకపోయినా.. పొరపాటున కొన్ని మాటలు అన్నా సరే ప్రభావం చూపిస్తాయట. అవేంటి..? పిల్లల ముందు తల్లి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లులు పిల్లలతో కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇలా ఉండటంలో తప్పులేదు. కానీ కఠినంగా ఉండవద్దు. పిల్లలకు ప్రతి విషయంలో రూల్స్ పెట్టి… దానికి తగినట్లే ఉండాలి అనవద్దు. తల్లులు పిల్లలతో కాస్త సున్నితంగా మెలగాలి. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని పిల్లలకు చాలా క్లియర్ గా చెప్పాలి. ఎక్కువ కఠినంగా ఉంటే… పిల్లలతో మీ బంధం సరిగా ఉండదు. కాబట్టి ఆ పొరపాటు చేయవద్దు. చాలా మంది తల్లులు… తమ మాట వినడం లేదని… పిల్లలను తిడ్తారు. కానీ… మీరు అలా ఎక్కువగా తిట్టడం, అరవడం చేయవద్దు. చేస్తే వాటిని భరించలేక పిల్లలు మీకు దూరం అవుతారు. అందుకే పొరపాటు చేయవద్దు.

ఎక్కువ మంది తల్లులు చేసే పని ఏంటంటే…. పిల్లలు ఏదైనా చేయగానే వెంటనే మీ నాన్నకు చెబుతాను అంటారు.ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లి గౌరవం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఎందుకంటే పిల్లలు తమ తల్లి ఒంటరిగా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదని అనుకుంటారు. మీరు కూడా ఇలాగే చేస్తే పిల్లల పెంపకంలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నట్టే. అందుకే వెంటనే మీకు ఈ అలవాట్లు ఉంటే స్వస్తి చెప్పండి.

చాలా మంది తల్లులు పిల్లల మాట వినకుండ వారితో మాట్లాడకుండా సూచనలు మాత్రమే ఇస్తుంటారు. నిజానికి ఇలా చేయవద్దు. మీరు పిల్లలతో మాట్లాడాలి. వారు చెప్పేదాని మీద శ్రద్ధ వహించాలి అంటున్నారు నిపుణులు. పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలకు ఎప్పుడూ సూచనలు ఇవ్వడం మాత్రమే కాదు చక్కగా మాట్లాడటం కూడా అవసరమే.

కామన్ గా చాలా మంది తల్లులు చేసే మరో తప్పు ఏంటంటే? పిల్లలను పక్కవారితో పోలుస్తారు. ఒక్కోసారి పిల్లల లోపాలను ఎత్తి చూపి పక్కవారి పిల్లలతో పోల్చడం మంచిది కాదు. అంటే మార్కులు బాగా వచ్చినప్పుడు అదే తరగతికి చెందిన మరో పిల్లవాడితో పోల్చుతారు. ఇది మాత్రమే కాదు, చాలా మంది తల్లులు తమ ఇతర పిల్లలతో తమను తాము పోల్చుకుంటారు కూడా. అయితే ఇలా చేయడం వల్ల పిల్లల మనస్సులలో ఒత్తిడి వస్తుంది. ఇది పిల్లలను చాలా మానసికంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇలా అసలు చేయకండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.