Brave: ప్రస్తుత ప్రపంచంలో జీవించాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. మరి ఈ ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మాత్రమే ఉంటుంది. మరి ధైర్యం అంటే ఏమిటి? ధైర్యం ఉండాలంటే ఏం చేయాలి? అసలు ధైర్యానికి అర్థం ఏమిటి? మీకు తెలుసా? ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ అన్ని సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవడం కష్టమే. కొన్ని సమస్యలు మిమ్మల్ని చాలా నాజూకు చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. మరి ధైర్యం అంటే ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
తీర స్వభావం ధైర్యం. అంటే ఆయన కదలడు. ఎవరు కదిలించినా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆయన కదలడు. అలాంటి వ్యక్తిని తీరస్వభావం గల వారు అంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా చలించక పోవడమే ధీరత్వం. అందుకే ఈ ధీరత్వానికి ఏది గొప్పది అంటే అందరూ చెప్పే ఉదాహరణ ముందు మేరుపర్వతం. అంతేకాదు దీనికి బెస్ట్ ఉదాహరణ రాముడు అని కూడా చెప్పవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చలించలేదు. కుంగిపోలేదు ఆ సీతారాముడు.
ఆ రామయ్యకు రాజ్యం పోయింది. సీతమ్మను రావణాసురుడు తీసుకొని వెళ్ళాడు. దశరథుడు మరణించడాని తెలిసినా సరే కానీ ఆ రాముడు అదరలేదు. బెదరలేదు. అంతేకాదు లక్ష్మణుడు చనిపోయేంత పరిస్థితి వచ్చినా కూడా ఆ రామయ్య చలించలేదు. ప్రతి మానవుల మాదిరి బాధ పడ్డారు కానీ.. తిరిగి మళ్లీ పుంజుకొని ఆయన చేయాల్సిన కార్యకలాపాలు చేశారు.
రాముడి వలే, మేరుపర్వతం వలె కష్టాలు వచ్చినప్పుడు మానవులు కూడా అదే విధంగా ఉండాలని చెబుతారు. కష్టాన్ని ఎదుర్కోక పోయినా చలించకుండా ఉండటమే ఉత్తమం. కదలకుండా ఉంటే చాలు సమస్యనే తలవంచుతుంది అంటారు పెద్దలు. మరి ఎంతటి సమస్య వచ్చినా మీరు కూడా ఇదే మాదిరి ఉంటూ మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్లండి. ధైర్యం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ధైర్యంగా ఉండండి.