Solar Eclipse 2022: భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ప్రభావం భూమిపై కూడా పడుతుంది. ఇలా ఎంతమేరకు ప్రభావం ఉంటుందో దానిని భట్టి పూర్తి సూర్యగ్రహణం లేదా పాక్షిక గ్రహణంగా పేర్కొంటారు. ఈ ఏడాది ఇప్పటికే ఏప్రిల్ 29న సూర్యగ్రహణం ఏర్పడింది. కానీ ఈ ప్రభావం కొంచెం కూడా భారత్ పై చూపలేదు. కానీ అక్టోబర్ 25న వచ్చే సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రహణం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేదానిపై కొందరు పండితులు, శాస్త్రవేత్తలు తమ సూచనలు అందిస్తున్నారు. అయితే సూర్యగ్రహణం హైదరాబాద్ లో ఎప్పుడు మొదలై.. ఎప్పుడు పూర్తవుతుంది..?

సాధారణంగా గ్రహణం ఆయా ప్రాంతాలను భట్టి మారుతూ ఉంటుంది. పాక్షిక సూర్యగ్రహణం కనిపించే తొలి ప్రాంతం 2 గంటల 28 నిమిషాలు ఉంటుంది. గరిష్ట సూర్యగ్రహణం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల 16 సెకన్లకు ఉంటుంది. పాక్షిక గ్రహణం సాయంత్రం వేళల్లో 6 గంటల 32 నిమిషాల 11 సెకన్లకు మొదలవుతుంది. సాయంత్రం ఏర్పడే పాక్షిక గ్రహణాన్ని అన్షిక్ సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఈ అక్టోబర్ 25న ఏర్పడేది అన్షిక్ సూర్యగ్రహణం.
భారత కాలమాన ప్రకారం ఈ సూర్యగ్రహణంను సాయంత్రం వేళల్లోనే చూడొచ్చు. ఢిల్లీలో సాయంత్రం 4.49 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ముంబైలో 4.49 నిమిషాలకు, చెన్నైలో సాయంత్రం 5.14 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. ఇక హైదరాబాద్ లో సాయంత్రం 4.59 నిమిషాలకు ప్రారంభమై 5.48 నిమిషాలకు ముగుస్తుంది. అంటే మన హైదరాబాద్ లో 49 నిమిషాల పాటు సూర్యగ్రహణం ఉంటుంది. ఇక ఇండియాలో 1 గంట 19 నిమిషాలు ఉంటుంది.

గ్రహణం సందర్భంగా భారత్ లో అనేక ఆచారాలు పాటిస్తారు. ఈ సమయంలో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని కొందరు జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం టెలీస్కోప్ ద్వారా గ్రహణాన్ని చూడొచ్చని అంటున్నారు. నేరుగా చూడడం ద్వారా కళ్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈసారి దీపావళి సందర్భంగా సూర్యగ్రహణం రావడం ప్రత్యేకత చాటుకుంది.