Homeఎంటర్టైన్మెంట్Allu Arjun trolling social media: మన ఆర్జీవీ, పూరి జగన్నాథ్ కంటే అట్లీ గొప్పోడా..?...

Allu Arjun trolling social media: మన ఆర్జీవీ, పూరి జగన్నాథ్ కంటే అట్లీ గొప్పోడా..? అల్లు అర్జున్ ను ఆడుకుంటున్న నెటిజన్లు…

Allu Arjun trolling social media: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతున్నారు… ఇక ఈ క్రమంలోనే ‘పుష్ప […]

Allu Arjun trolling social media: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతున్నారు… ఇక ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ సినిమాతో అల్లు అర్జున్ పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. దాంతో ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. అందులో అట్లీ, లోకేష్ కనకరాజుకు మాత్రమే అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్న నేపథ్యంలో తొందరలోనే ఈ సినిమాలను రిలీజ్ చేసి మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు… ఇక అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ పేరుతో ఒక డాల్బీ థియేటర్ ని కట్టించాడు. రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో దానిని గ్రాండ్ గా ఓపెన్ కూడా చేశారు…

ఇక అందులో ‘ది గ్రేట్ డైరెక్టర్ వాల్’ అంటూ ఒక పెద్ద గోడ మీద చాలామంది దర్శకుల ఫోటోలైతే వేశారు. అందులో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకుల ఫోటోలు వేశారు బాగానే ఉంది. కానీ వీళ్లతో పాటుగా తమిళ్ డైరెక్టర్ ఆయన అట్లీ ఫోటోను కూడా వేశారు. అట్లీ ఏం సాధించాడని అతని ఫోటోని ద గ్రేట్ డైరెక్టర్స్ వాల్ మీద వేశారు.

Also Read: యాంకర్ అనసూయ పై అసభ్యకరమైన పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

తెలుగు లో టాప్ డైరెక్టర్లైన ఆర్జీవీ, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల ఫోటోలు ఎందుకని అక్కడ పెట్టలేదు. ఇక ఒకప్పటి కె.వి.రెడ్డి, విఠలాచార్య, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు లాంటి గొప్ప దర్శకుల ఫోటోలు కూడా అక్కడ లేవు… సరే వాళ్లనైతే మర్చిపోయాడు అనుకున్న కూడా ఆర్జీవి, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళని ఎలా మర్చిపోయాడు. పూరి జగన్నాథ్ అలీ అర్జున్ కి దేశముదురు లాంటి ఒక భారీ సక్సెస్ ని అందించాడు. అలాగే అల్లు అర్జున్ కి ఒక సపరేట్ క్యారక్టరైజేషన్ ని కూడా ఇచ్చాడు.

అలాంటి దర్శకుడిని ఎలా మర్చిపోయావ్ అంటూ నెటిజన్లు సైతం అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు…మరి కొంతమంది అల్లు అర్జున్ వాల్ మీద ఉంటేనే వాళ్ళు గ్రేట్ డైరెక్టర్ల లేకపోతే వాళ్లు గ్రేట్ డైరెక్టర్లు కాదా? అల్లు అర్జున్ వాళ్ళందరిని గుర్తించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరు ఎప్పుడో లెజెండరీ దర్శకులుగా మారిపోయారు అతను గుర్తించనంత మాత్రాన వాళ్లు తక్కువై పోరు అంటూ సెటైరికల్ గా అల్లు అర్జున్ మీద కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper