Karthi Sardar Collections: విశాల్ తో అభిమన్యుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన మిత్రన్ ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ తో ‘సర్దార్’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..నిన్న ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు మరియు తమిళం బాషలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను విడుదలకి ముందే బాగా ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది.

మూడు గంటల నిడివి ఉన్న సినిమా అయ్యినప్పటికీ కూడా ఎక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు లేకుండా చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని డైరెక్టర్ మిత్రాన్ తెరకెక్కించాడు..వీరుమాన్, పొన్నియ్యన్ సెల్వన్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న కార్తీ కి ‘సర్దార్’ సినిమాతో హ్యాట్రిక్ అందుకునట్టు అయ్యింది..ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఘనంగా విడుదలైన ఈ సినిమా కి తెలుగులో అద్భుతమైన ఓపెనింగ్ వచ్చింది..బాక్స్ ఆఫీస్ వద్ద నిన్న కాంపిటీషన్ గా ‘సర్దార్’ కి పోటీ గా మూడు సినిమాలు విడుదలైనప్పటికీ కూడా సర్దార్ జోరు ఏ మాత్రం తగ్గలేదు..గుట్టుచప్పుడు కాకుండా విడుదలైన ఈ సినిమాకి తెలుగు లో మంచి ఓపెనింగ్స్ రావడానికి ముఖ్య కారణం కార్తీ అని చెప్పాలి..ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి నిన్న దాపుగా 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అందులో కేవలం నైజాం ప్రాంతం నుండే 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో పది లక్షల రూపాయిలు మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 45 లక్షల రూపాయిలు వసూలు చేసింది.

ఓవర్సీస్ మరియు కర్ణాటక వంటి ప్రాంతాల వసూళ్లు కూడా కలిపితే ఈ చిత్రానికి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచుంటాయని అంచనా..నిన్న సెకండ్ షోస్ ఎక్కడ చూసిన హౌస్ ఫుల్స్ కనపడ్డాయి..దీనిని బట్టి చూస్తుంటే ఈ సినిమాకి లాంగ్ రన్ పక్కా అనే విషయం అర్థం అవుతుంది..దీపావళి పండుగ లోపే బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.