Whatsapp: ఇప్పుడున్న కాలంలో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు మొబైల్ ఫోన్ నుకచ్చితంగా వాడుతున్నారు. వ్యక్తిగత అవసరాలతో పాటు ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి కమ్యూనికేషన్ ఉండాలి. వీరి కోసం మొబైల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మొబైల్స్ లో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు ఉండడంతో కొందరు హ్యాకర్లు వీటి నుంచి విలువైన సమాచారం దొంగిలిస్తున్నారు. ఫోన్ నెంబర్.. ఓటీపీ.. వివిధ యాప్స్ ద్వారా వినియోగదారుల మెయిన్ డేటాను చోరీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో హ్యాకర్ల నుంచి తప్పించుకోవడానికి మొబైల్స్ లోని కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోన్ లో అత్యధిక యూజర్లు కలిగిన వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండాలంటే వీటిని చేంజ్ చేసుకోవాలి. అవేంటంటే?
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ Whats app తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. విద్యార్థుల అప్డేట్ ఇవ్వడానికి స్కూల్ యాజమాన్యం సైతం వాట్సాప్ ను యూజ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన వాట్సాప్ ను హ్యాక్ చేయడం ద్వారా విలువైన సమాచారం దొంగిలించవచ్చని కొందరి సైబర్ నేరగాళ్ల ఆలోచన. ఈ నేపథ్యంలో వాట్సాప్ మెసేజేస్, ఫోటోస్, వీడియోస్ కోసం వల వేస్తుంటారు. అయితే వారిని తిప్పికొట్టేందుకు ఫోన్ లో ముందు జాగ్రత్తగా కొన్ని ఆప్షన్స్ ను మార్చుకోవాలి. వీటిలో ప్రధానంగా 3 ఉన్నాయి.
మొదటి ఆప్షన్ ఎంటేంటే.. ఫోన్ లోని Whatsapp Settingsలోకి వెళ్లాలి. ఇందులో Privacyపై క్లిక్ చేయగానే ఇందులో Groups అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లగా Everyone పై టిక్ చేసి ఉంటుంది. దీనిని తీసేసి my contactsను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో తెలియని కాంటాక్ట్ ఎవరూ మెసేజ్ చేయకుండా ఉంటారు. అంతేకాకుండా ఆటోమేటిక్ గా గ్రూప్ క్రియేట్ కాకుండా ఉండి అనవసరమైన లింక్స్ పై క్లిక్ చేసే అవకాశం ఉండదు. ఇలా చేయడం వల్ల కాంటాక్ట్ ఉన్నవారు మాత్రమే గ్రూప్ లోకి యాడ్ చేస్తారు. కొత్తవారు యాడ్ చేయడానికి అవకాశం ఉండదు.
రెండో ఆప్షన్.. Privacy లోకి వెళ్లి calls అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్లగా Silence Unknown callers అనేది ఆఫ్ అయి ఉంటుంది. కానీ దీనిని ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు హ్యాకర్లు కాల్స్ చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి మనం గుర్తించలేం. అందువల్ల ఇది ఆన్ చేయడం వల్ల కాంటాక్ట్ లేని కాల్స్ రాకుండా ఉంటాయి. ఇందులోనే Advanced అనే ఆప్షన్ లోకి వెళ్లి protect ip adress calls అనే దానిపై క్లిక్ చేసి ఆన్ చేయాలి. దీంతో స్కామర్లు లైవ్ లోకేషన్ ను గుర్తించలేదు.
మూడో ఆప్షన్ లోకి వెళ్తే accounts అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. ఇప్పుడు Two step verification ను ఆన్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్ ను ఓపెన్ చేయాలంటే కొత్తవారికి సాధ్యం కాదు. అంతేకాకుండా ఇది పాస్ వర్డ్ తో క్రియేట్ అయి ఉంటుంది.
ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల మీ వాట్సాప్ ఎటువంటి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటుంది.