Whatsapp: ఆధునిక కాలంలో పోటీ పెరుగుతోంది. అన్నింట్లోనూ పోటీ వాతావరణం ఎక్కువవుతోంది. దీంతో సంస్థలు తమ ప్రభావం కోసం అన్ని మార్గాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే వినియోగదారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ముందుకు వస్తున్నాయి. వాట్సాప్ కూడా డిమాండ్ లేని వాటిని తొలగించి ఉపయోగకరమైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. దీని కోసం గతంలోనే తీసేసిన ఫీచర్ ను మళ్లీ తీసుకొచ్చి యూజర్లను సంబరపెడుతోంది. గతేడాది తొలగించిన ఫీచర్ ను మళ్లీ తీసుకొస్తోంది.

వాట్సాప్ లో ఒకటి కంటే ఎక్కువ మెసేజ్ లను ఒకేసారి ఎంపిక చేసి ఇతరులకు పంపేందుకు లేదా డిలీట్ చేసేందుకు మల్టీపుల్ చాట్ సెలెక్షన్ ఫీచర్ ను ఉపయోగిస్తుంటాం. గతేడాది ఈ ఫీచర్ ను డెస్క్ టాప్ నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ మొబైల్ యాప్, వెబ్ వర్షన్ యూజర్లకే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ ను సెలెక్ట్ చాట్స్ పేరుతో మళ్లీ డెస్క్ టాప్ యాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో యూజర్లకు ఫీచర్ తిరిగి లైవ్ లోకి రానుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ను పరీక్షిస్తోంది. యూజర్ల కోరిక మేరకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చి తన ప్రభావం పెంచుకోవాలని చూస్తోంది. యూజర్లకు నచ్చిన టెక్ట్స్, మీడియా ఫైల్స్ లేదా వెబ్ లింకులను చూసేందుకు స్టేటస్ లో పెట్టుకునేందుకు సిద్ధంగా తయారు చేస్తోంది. యూజర్లు ఇంకా ఏమైనా సందేహాలుంటే వాట్సాప్ కు ఫిర్యాదు చేయవచ్చు. తమకు అనుగుణంగా యాప్ తయారు చేయాలని సూచనలు, సలహాలు అందించొచ్చు. ప్రస్తుతం పరీక్షలు చేసి త్వరలో యూజర్ల ముందుకు తీసుకురానుంది.

యూజర్లు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సందేశాలు ఎంపిక చేసుకుని పంపించుకోవచ్చు. ఇంకా డిలీట్ చేయొచ్చు. మ్యూట్ కూడా చేసే అవకాశం ఉంది. దీంతో వాట్సాప్ రోజురోజుకు వినియోగదారుల చెంతకు చేరేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది. ఇప్పుడు తొలగించిన వాటిని కూడా తీసుకొస్తూ యూజర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. వాట్సాప్ రోజురోజుకు ప్రజల చెంతకు చేరుతోంది. వారికి అన్ని సేవలు అందజేస్తోంది.