Kidney Stones: మారుతున్న జీవనశైలితో మనకు అనేక రోగాలు వ్యాపిస్తున్నాయి. లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటున్నాం. ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఫలితంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇటీవల కాలంలో మూత్ర పిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు రావడం జరుగుతోంది. దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. శరీరంలో నీరు శాతం తగ్గడంతోనే రాళ్లు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. సరైన మోతాదులో నీరు తాగకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు రావడం సాధారణ వ్యాధిగానే గుర్తిస్తున్నారు.

మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఊబకాయం, బరువు తగ్గడం, ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాల్షియం, యూరిక్ యాసిడ్ కలిగిన ఖనిజాలు, ఉప్పు సేకరణ ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి. శరీరంలో పేరుకుపోయిన ఖనిజాలు మూత్రంలో నిలిచినప్పుడు రాళ్లు రావడానికి కారణమవుతోంది. శరీరంలో నీటి శాతం తగ్గితే రాళ్లు ఏర్పడతాయని తెలిసినా చాలా మంది తగినంత నీరు తాగేందుకు మొగ్గు చూపడం లేదు.
మూత్రపిండాల్లో రాళ్లు వచ్చాయని తెలిసేందుకు కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. తరచుగా మూత్ర విసర్జన రావడం, మూత్రం రంగు మారడం, మూత్రం పోసేటప్పుడు నొప్పి, నిద్రలేమి, వాంతులు, కాళ్లలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురు కావచ్చు. మూత్రపిండాల్లో వచ్చిన రాళ్లను తగ్గించుకోవడానికి తక్షణ పరిష్కారం నీరు పుష్కలంగా తాగాలి. ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. నిమ్మసోడా, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

మనం తినే ఆహారాల్లో ఉప్పు శాతం తగ్గించాలి. బంగాళాదుంపు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచ్, మాంసం, సూపులు, ప్యాక్ చేసిన ఆహారాలు, స్పోర్ట్స్ డ్రింక్ వంటివి తీసుకోవద్దు. ఇలా జాగ్రత్తలు పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీంతో మనం కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగుతుండాలి. సరైన ఆహారాలు తీసుకుని మన ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తేనే మంచిది.