Spiritual Tips: భారత రాజ్యాంగం మనకు హక్కులు, బాధ్యతలు కల్పించింది. వాటి కోసం అనేక పోరాటాలు చేస్తాం. అయితే ఇంటి బాధ్యతల విషయంలో మాత్రం తప్పించుకుంటున్నాం. గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్లు.. బాధ్యతలను నిర్వర్తించకుండా అన్నీ కావాలని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. పూజలు, వ్రతాలు చేస్తున్నారు. కానీ బాధ్యతలు నిర్వర్తించకుండా ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుందని అంటున్నారు పండితులు ఇందుకు ఉదాహరణతో సహా వివరిస్తున్నారు.
రమణ మహర్షి బోధన..
30 ఏళ్ల ఓ యువతి ఓసారి పరమహంస పరివ్రాజకాచార్యా అనే బిరుదుకు అర్హుడైన ఒకే ఒక్క వ్యక్తి రమణ మహర్షి(Ramana Maharshi) వద్దకు వెళ్లింది. అప్పటికే ఆమెకు పెళ్లి జరిగి మూడు నాలుగేళ్లు అయింది. అయితే ఆ యువతి దృష్టి అంతా రమణ మహర్షి వద్దకు వెళ్లాలని కోరిక. తనకు ఆత్మజ్ఞానం కావాలని కోరుకుంటోంది. ఈ విషయాన్ని ఓరోజు భక్తుకు చెబుతుంది. దానికి ఆయన సమ్మతించరు. దీంతో సదరు యువతి సందిగ్ధంలో పడిపోతుంది. సంసార జీవనం సాగించాలా లేక ఆత్మజ్ఞానం పొందాలా అనే విషయం తేల్చుకోలేకపోతుంది. ఈ క్రమంలో ఒకరోజు రమణ మహర్షి వద్దకు వెళ్తుంది.
గృహస్తు మార్గమే గొప్పదని..
ఈ సందర్భంగా రమణ మహర్షిని కలిసిన యువతి ఆయన కాళ్లపై పడి వేడుకుంటుంది. తన మనసంతా ఇక్కడే ఉందని, తన భర్త మాత్రం సంసారం, పిల్లలు అంటున్నాడని పేర్కొంటుంది. దీనిపై రమణ మహర్షి ఆమెకు ఉద్బోధ చేశాడు. తనకు పెళ్లి లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నానని, పెళ్లి చేసుకున్న నీవు కుటుంబ బాధ్యతలు, సంసార బాధ్యతలు నిర్వర్తించాలని సూచిస్తాడు. అప్పటికీ నీకు ఇక్కడకు రావాలనే కోరిక ఉంటే 70 ఏళ్ల తర్వాత ఇక్కడకు రావాలని సూచిస్తాడు. దీంతో ఆమె తన సందిగ్దం తొగిపోయినట్లు భావించి ఇంటికి వెళ్తుంది. భర్తతో సంసారం చేసి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించి పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది.
70 ఏళ్ల వయసులో మళ్లీ..
30 ఏళ్లప్పుడు యువతిగా వెళ్లిన ఆమె.. అన్ని బాధ్యతలు నిర్వర్తించి 70 ఏళ్ల వయసులో మళ్లీ రమణ మహర్షి వద్దకు వెళ్తుంది. అక్కడ ఆయన కనిపించరు. దీంతో అక్కడున్నవారిని అడుగుతుంది. దానికి వాళ్లు రమణ మహర్షి సామాన్యుడు కాదని, ఇక్కడ అక్కడ అని తేడా ఏమీ లేదని ఆ మహాపురుషుడు అంతటా ఉన్నాడని చెబుతారు. దీంతో ఆమె ప్రశాంతపడి ఆమె అక్కడే గడుపుతుంది. ఆమె భర్త కూడా అందుకు అంగీకరిస్తాడు.
ఇలా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఫలితం ఆశించడంలో అర్థం ఉంటుందని, బాధ్యతల నుంచి తప్పించుకుని ఎన్ని చేసినా ఫలితం ఉండదని గురువులు పేర్కొంటున్నారు.